1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Bigg boss show ice tub challenge

గెలుపు కోసం ఇంతలానా? ప్రాణాల మీదకు తెచ్చుకుంటారా..?

Bigg boss
బిగ్ బాస్ 5 షో నడుస్తున్న తీరు ఆసక్తిని రేకెత్తిస్తోంది. 19 మందితో ప్రారంభమై ప్రస్తుతం 12కి చేరింది. ప్రతిసారి ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తి. అయితే వచ్చేవారం మాత్రం కెప్టెన్ లేకపోవడంతో ఎలాంటి టాస్క్ అన్నది మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

 
కానీ తాజాగా ఐస్ టబ్ చాలెంజ్‌లో అపశృతి చోటుచేసుకుంది. గేమ్‌లో లీనమై ఆడుతున్న షణ్ణు జస్వంత్, శ్రీరామచంద్ర, ప్రియాంక సింగ్, సిరి షన్మంత్‌లు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.

 
వీరు ఒకరిని మించి ఒకరు ఆడుతుండగా అస్వస్థతకు గురయ్యారట. దీంతో వెంటనే వీరిని మెడికల్ రూంకు తీసుకెళ్ళారట. అయితే వీరికి పెద్ద ప్రమాదమేమీ లేదని వైద్యులు నిర్థారించారట. గతంలో జరిగిన బిస్ బాస్ షోలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదని నిర్వాహకులు చెబుతున్నారు.

 
కానీ సీజన్ 5 మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్న నేపథ్యంలో ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో కంటెన్టెంట్లు పోటీలు పడి మరీ ఆడుతున్నారట. మరి చూడాలి. ఎవరు గెలుస్తారన్నది.
తర్వాతి కథనం
ప్రియాంకకు ఎవరూ ఓటు వేయడం లేదట, ఎందుకు..?