శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: బుధవారం, 1 డిశెంబరు 2021 (21:09 IST)

ప్రియాంకకు ఎవరూ ఓటు వేయడం లేదట, ఎందుకు..?

బిగ్ బాస్ 5 సీజన్లో ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న పేరు ప్రియాంక. ఈమె బిగ్ బాస్ షోలో చేసిన దాన్నే చేస్తున్నట్లుగా.. మాట్లాడిన విషయాలనే మాట్లాడుతున్నట్లుగా ఉంది. దీంతో ప్రియాంకను మొదట్లో అభిమానించిన వారు దూరమైపోయారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 
ఇదిలా ఉంటే త్వరలోనే ప్రియాంక ఎలిమినేట్ అవుతుందన్న ప్రచారం బాగానే ఉంది. దీంతో ఓటింగ్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే హౌస్‌లో ప్రియాంక ఉండడం ఆమెను అభిమానించే వారికే ఇష్టం లేదట. దీంతో ఓటు వేయడం లేదట.

 
ఓట్ ఫర్ ప్రియాంక అని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతున్నా ఏ ఒక్కరు సందేశాలు పంపడం లేదట. దీంతో నిర్వాహకులు కూడా ఆశ్చర్యపోతున్నారట. ఇలా ఉంటే ప్రియాంక ఎలిమినేట్ కావడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోందట. మూస పద్ధతిలో కాకుండా కొత్తదనంగా ఇకనైనా షో చేయమ్మా అంటూ ప్రియాంకకు సందేశాలు పంపుతున్నారట అభిమానులు.