బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: మంగళవారం, 30 నవంబరు 2021 (15:54 IST)

ఆ అతి బిగ్ బాస్ హౌస్ నుంచి ప్రియాంకను బయటకు పంపేస్తుందా?

బిగ్ బాస్ షోలో ప్రస్తుతం ఉన్నది షన్ను, శ్రీరామచంద్ర, కాజల్, మానస్, సన్నీ, ప్రియాంక, సిరిలు. అయితే ఇందులో ఎలిమినేట్ నెక్ట్స్ ఎవరన్నది ఆసక్తికరంగా ఉంది. అయితే ప్రియాంక మాత్రం చాలా ఆచితూచి సేఫ్ గేమ్ ఆడుతోంది. నామినేషన్ చేసే అవకాశం నీకిస్తే అంటూ కెప్టెన్ షన్ను గత వారం అడగటం అందుకు తీవ్రంగా ప్రియాంక స్పందించింది.

 
నిన్నే నామినేషన్ చేస్తా అంది. సీరియస్‌గా మాట్లాడమని షన్ను చెబితే ఆ తరువాత కాజల్ గురించి చెప్పడం మొదలెట్టింది. మొఖం కూడా సరిగ్గా కడుక్కోదంటూ రాగాలు తీయడం మొదలెట్టింది ప్రియాంక. దీంతో అది పాత పాటేనంటూ అందరూ భావించారు.

 
ప్రియాంక చేస్తున్న పని బిగ్ బాస్‌కు బాగా చిర్రెత్తుకొచ్చేలా చేస్తోందట. ప్రియాంక ఇలా చేస్తే నీకు నువ్వే ఎలిమినేట్ అవుతావని హెచ్చరించాడట. దీంతో అభిమానులు కూడా ప్రియాంకపై కోపంగా ఉన్నారట. ఎప్పుడూ ఒకే విధంగా ఆడటం మాని పంధా మార్చాలంటున్నారట. లేకుంటే ఎలిమినేట్ కావడం ఖాయమన్న అభిప్రాయం పలువురు నుంచి వ్యక్తమవుతోంది.