గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: సోమవారం, 29 నవంబరు 2021 (18:57 IST)

బిగ్ బాస్ హౌస్ నుంచి యాంకర్ రవి ఔట్: జనం రవి అంటే పెదవి విరిచేసారా?

బిగ్ బాస్ 5 సీజన్ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. నువ్వా నేనా అన్నట్లు పోటాపోటీగా బిగ్ బాస్ షో కంటెస్టెంట్లు షోలో ఆడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే యాంకర్ రవి ఎలిమినేట్ అవ్వడమే ఇప్పుడు పెద్ద చర్చకు కారణమవుతోంది. రవి చివరి వరకు ఉంటారు అనుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది. 

 
కాజల్, సిరి, ప్రియాంకలే ముందు వెళ్ళిపోతారని అనుకుంటే వాళ్ళ కన్నా తక్కువ ఓట్లు రవికి రావడంతో నిర్థాక్షిణ్యంగా బయటకు పంపేశారు. దీంతో రవి అభిమానులు నేరుగా సెట్ దగ్గరకు వెళ్ళి ధర్నా కూడా చేశారంట. ఇలా ఎందుకు చేస్తున్నారంటూ షో నిర్వాహకులను ప్రశ్నించారట.

 
ఇదిలా ఉంటే అసలు రవికి బిగ్ బాస్ హౌస్‌లో ఉంటే ప్రతి వారానికి 8 లక్షల రూపాయలు ఇచ్చుకోవాట. ఈ లెక్కన 80 లక్షల రూపాయల దాకా నిర్వాహకులు ఇచ్చారట. అసలు బిగ్ బాస్ గెలిస్తేనే 50 లక్షలు ఇవ్వాలి. అలాంటిది ఇప్పటికే రవికి 80 లక్షల రూపాయల దాకా ఇచ్చాం. 

 
ఇక రవిని భరించలేమంటూ నిర్వాహకులే ఎలిమినేట్ చేసి బలవంతంగా తోసేసారంటూ ప్రచారం జరుగుతోంది. అభిమానులు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నారట. ఇలా చేయడం ఎంతవరకు కరెక్టని ప్రశ్నిస్తున్నారట. ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో కరెక్టుగా నిర్వాహకులు చెప్పరు. అలాంటిది రవికి మిగిలిన వారి కన్నా ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశమే ఉంది. ఇకనైనా ఇలాంటివి మానండి అంటూ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సందేశాలు పంపిస్తున్నారట రవి అభిమానులు.

 
మరి రవి ఫ్యాన్స్ చెపుతున్నట్లు కారణం ఇదేనా... లేదంటే నిజంగానే జనం యాంకర్ రవి అంటే పెదవి విరిచేసారా?