1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Chiranjeevi tests negative for Covid-19, initial test deemed faulty

కాలం - కరోనా కన్ఫ్యూజ్ చేసి నాతో ఆడుకున్నాయి... చిరంజీవి

Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి కరోనా వైరస బారినపడ్డారు. ఈ విషయం తెలియగానే ఆయన అభిమానులతో పాటు.. సినీ ప్రముఖులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పైగా, ఆయన త్వరగా కోలువాలని ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు. అయితే, చిరంజీవి ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. 14 రోజుల తర్వాత బాహ్య ప్రపంచంలోకి రానున్నట్టు ప్రకటించారు. పైగా, తాను ఆరోగ్యవంతంగా ఉన్నట్టు ప్రకటించారు. అందువల్ల ఏ ఒక్కరూ ఆందోళన చెందనక్కర్లేదని చెప్పుకొచ్చారు. 
 
అయితే, తాజాగా ఆయన మరికొన్ని టెస్టులు చేయించుకోగా, ఆయనకు అసలు కరోనాయే సోకలేదన్న విషయం వెల్లడైంది. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ప్రకటన చేశారు. అసలేం జరిగింది వివరించారు. కాలం, కరోనా గత నాలుగు రోజులుగా తనను కన్ఫ్యూజ్ చేసి, తనతో ఆడేసుకున్నాయని చెప్పారు. 
 
ఆదివారం టెస్ట్ రిపోర్టులో పాజిటివ్ అని నిర్ధారణ అయిన వెంటనే బేసిక్ మెడికేషన్‌ను ప్రారంభించానని తెలిపారు. రెండు రోజులైనా తనలో ఎలాంటి లక్షణాలు లేకపోయేసరికి తనకే అనుమానం వచ్చిందని... దీంతో అపోలో ఆసుపత్రికి వెళ్లానని చెప్పారు.
 
డాక్టర్లు తనకు సీటీ స్కాన్ తీసి ఛాతీలో ఎలాంటి ట్రేసెస్ లేవని నిర్ధారణకు వచ్చారని చెప్పారు. అక్కడ నెగెటివ్ అని ఫలితం వచ్చిన తర్వాత... మరోచోట నివృత్తి చేసుకుందామని టెనెట్ ల్యాబ్‌లో మూడు రకాల కిట్స్‌లతో టెస్ట్ చేయించుకున్నానని, అక్కడ కూడా నెగెటివ్ వచ్చిందని చెప్పారు. 
 
ఆదివారం తనకు పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చిన చోట కూడా చివరగా ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేయించానని... అక్కడ కూడా నెగెటివ్ వచ్చిందని తెలిపారు. ఈ మూడు రిపోర్టుల తర్వాత మొదటి రిపోర్ట్ తప్పుడు కిట్ వల్ల వచ్చిందనే నిర్ధారణకు డాక్టర్లు వచ్చారని చెప్పారు. తాను కోలుకోవాలని ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు చెపుతున్నానని అన్నారు.

 
తర్వాతి కథనం
వామ్మో.. సోనియా అగర్వాల్ ఆ పని చేసిందా?