శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 నవంబరు 2020 (16:21 IST)

చిరంజీవికి కరోనా వైరస్ - తెలంగాణ సీఎంవోలో కలకలం!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కరోనా బారినపడ్డారు. 'ఆచార్య' షూటింగుకు వెళుతూ ముందుజాగ్రత్తగా ఆయన కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని వచ్చింది. దాంతో ఆయన గత కొన్నిరోజులుగా తనను కలిసినవాళ్లు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
 
చిరంజీవికి కరోనా అని తెలియడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో కలకలం రేగింది. ఎందుకంటే చిరంజీవి ఇటీవలే సహనటుడు నాగార్జునతో కలిసి సీఎం కేసీఆర్‌ను కలిసి వరద సాయం చెక్కులు అందించారు. 
 
అది జరిగిన రెండు రోజులకే చిరుకు కరోనా పాజిటివ్ అని తేలడంతో సీఎంవో అధికారులు కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌ను చిరు, నాగ్‌లు కలిసిప్పుడు అక్కడే ఉన్న ఎంపీ సంతోష్ కూడా తాజాగా కరోనా టెస్టు చేయించుకున్నారు. ఆయనకు నెగెటివ్ వచ్చినట్టు తెలిసింది.
 
కాగా, సీఎం కేసీఆర్‌ను కలిసిన సందర్భంలో చిరంజీవి, నాగార్జున మాస్కులు ధరించకపోవడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. వీరిద్దరితో సమావేశనపుడు సీఎం కేసీఆర్ కూడా మాస్కులు ధరించలేదు.
 
హీరోయిన్లను మందలించారు.. కరోనా వైరస్ కుట్టింది..  
మెగాస్టార్ చిరంజీవికి కరోనా వైరస్ సోకింది. దీనిపై వైకాపా అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. చిరంజీవిని పరామర్శించేందుకు కాల్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తలేదని తెలిపారు. దాంతో ట్వీట్ పెట్టానని వివరించారు.
 
కరోనా అంశంపై తెలంగాణ ప్రభుత్వానికి అనేక ప్రకటనలు ఉచితంగా చేసిన చిరంజీవి ఇప్పుడు తానే కరోనా బారినపడడం దురదృష్టకరమన్నారు. మాస్కులు ధరించాలంటూ చిరంజీవి అనేకమంది హీరోయిన్లను మందలించడం చూశామని, కానీ ఆయన ఒక్కసారి మాస్కు తీసి కనిపించాడని, కరోనా వచ్చేసిందని వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు.