మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 12 నవంబరు 2020 (20:27 IST)

వామ్మో.. సోనియా అగర్వాల్ ఆ పని చేసిందా?

7/G బృందావన్ కాలనీ హీరోయిన్ ప్రస్తుతం సినిమా ఆఫర్ల కోసం ఆత్రుతతో ఎదురుచూస్తోంది. హీరోయిన్‌గా బిజీగా ఉన్నప్పుడే దర్శకుడు సెల్వ రాఘవన్‌ను పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత విడాకులు అంటూ వివాదాల్లో కొన్ని రోజులు నలిగింది. ఆ తర్వాత సినిమాలో ఆఫర్లు తగ్గడంతో.. అడపాదడపా కొన్ని టీవీ ప్రోగ్రామ్స్‌లతో మెరిసి ఇప్పుడిప్పుడే క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలు దక్కించుకుంటోంది. 
 
కాగా ఈ భామ తాజాగా ఓ ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ తాజా ఫోటోలో సోనియా అగర్వాల్ ఏమాత్రం గుర్తుపట్టకుండా మారిపోయింది. పూర్తిగా సన్నజాజిలా తయారైంది. ఈ తాజా ఫోటో సోనియా బాగుందని మరికొందరు అంటున్నారు. హీరోయిన్ అవకాశాలు లేవు. ఇప్పుడు సైడ్ క్యారెక్టర్లకు పరిమితం అయిపోయిన సోనియా ఈ మధ్యే ఎవరో తల్లి పాత్ర ఆఫర్ చేశారని తెగ ఫీలైపోయింది. 
 
తనతో పాటు హీరోయిన్లయిన త్రిష, నయనతారలను ఇలా అడుగుతారా అని సోనియా ప్రశ్నించింది. కొత్త అవతారంలో గుర్తు పట్టలేని విధంగా తయారైన సోనియా.. తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న విషయాన్ని కూడా దాచకుండా బయటపెట్టేసింది. తాజాగా ఇప్పుడు ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.