గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (17:47 IST)

ముంబైలో గ్రాండ్‌గా రిలీజైన ఎన్టీఆర్ ‘దేవర’ థియేట్రికల్ ట్రైలర్

devara trailer
ముంబైలో గ్రాండ్‌గా ఎన్టీఆర్ ‘దేవర’ థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ వేడుకలో నిర్మాత క‌ర‌ణ్ జోహార్‌, అనిల్ త‌డాని స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొన్నారు. మొత్తం 2 నిమిషాల 39 సెక‌న్లున్న ఈ ట్రైల‌ర్ మాస్ ఎలిమెంట్స్ ప్యాక్డ్‌గా ఉంది. ఎన్టీఆర్ అభిమానుల‌కు, యాక్ష‌న్ మూవీ ల‌వ‌ర్స్ కోరుకునే అంశాల‌ు పుష్కలంగా ఉన్నాయి. ఈ మూవీ కోసం ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ క్రియేట్ చేసిన ప్ర‌త్యేక‌మైన ప్ర‌పంచం, ఆయ‌న విజ‌న్ అద్భుతంగా ఉన్నాయి. 
 
ఇకపోతే, ట్రైల‌ర్‌ను పరిశీలిస్తే, ప్ర‌కాష్ రాజ్ గంభీర‌మైన వాయిస్ ఓవ‌ర్‌తో ప్రారంభ‌మైంది. తీర‌ప్రాంతంలో ఎలాంటి భ‌యాలు లేని ప్ర‌జ‌లు నివ‌సిస్తుంటారు. అక్క‌డ ఉండే భైరా ఓ క్రూర‌మైన గ్యాంగ్‌తో ఆకృత్యాల‌కు పాల్ప‌డుతుంటాడు. ఆ ముఠా అక్క‌డ‌కొచ్చే ఓడ‌ల‌ను దోచుకోవ‌ట‌మేకాకుండా, కోస్ట్ గార్డుల‌ను కూడా చంపేస్తూ ర‌క్త‌పాతాన్ని సృష్టిస్తుంటారు. ఇలాంటి కొంత మంది కరుడుగట్టిన గ్రామ‌స్థుల‌కు భ‌యాన్ని ప‌రిచయం చేస్తాడు ‘దేవర’. 
 
ఆ గ్రామాన్ని పెను ప్ర‌మాదం నుంచి ర‌క్షించే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో ఎన్టీఆర్ పాత్ర మ‌న‌కు ప‌రిచ‌యం అవుతుంది. ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజ‌న్స్‌, అద్భుత‌మైన డైలాగ్ డెలివ‌రీ, ఆశ్చ‌ర్య‌ప‌రిచే ఎలివేష‌న్ స‌న్నివేశాల‌ల‌తో ఉన్న ఈ ట్రైల‌ర్ అంద‌రిలో సినిమాపై ఉన్న అంచనాల‌ను మ‌రింత‌గా పెంచుతోంది. ఎన్టీఆర్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారు. భ‌యానికి అర్థం చెప్పే ప్ర‌తిరూప‌మైన పాత్ర ఒక‌టైతే.. భ‌య‌ప‌డుతూ ఉండే మ‌రో పాత్ర‌లో ఎన్టీఆర్ క‌నిపించ‌నున్నారు. భైరా అనే అనే భ‌యంక‌ర‌మైన పాత్ర‌లో సైఫ్ అలీఖాన్ క‌నిపించారు. 
 
ఎన్టీఆర్‌, సైఫ్ మ‌ధ్య ఉన్న స‌న్నివేశాల‌ను చూస్తుంటే సినిమా నెక్ట్స్ లెవ‌ల్ అనేంత‌గా అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్ర‌కాష్ రాజ్‌, శ్రీకాంత్‌, అజ‌య్ తదితరులను ట్రైల‌ర్‌లో చూడొచ్చు. జాన్వీక‌పూర్ ఇందులో తంగం అనే ప‌ల్లెటూరి అమ్మాయి పాత్ర‌లో క‌నిపించింది. ఆమె క్యూట్ లుక్స్ ఆక‌ట్టుకుంది. ఎన్టీఆర్‌, జాన్వీ మ‌ధ్య ఉన్న స‌న్నివేశాలు ఆక‌ట్టుకునేలా ఉన్నాయ‌నిపిస్తుంది. అనిరుద్ ర‌విచంద‌ర్ అద్భుత‌మైన సంగీతంతో పాటు యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు ఆయ‌న అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ వింటుంటే అంచ‌నాలు ఆకాశాన్నంటుతున్నాయి. గూజ్‌బ‌మ్స్ వ‌స్తున్నాయి. 
 
ట్రైల‌ర్‌లో కొన్ని సీన్స్ అయితే క‌ళ్ల‌కువిందుగా ఉన్నాయి. ట్రైల‌ర్ చివ‌ర‌లో ఎన్టీఆర్ షార్క్‌పై ఉండి రైడ్ చేసే సీన్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంది. దేవ‌ర చిత్రాన్ని అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. ప్ర‌తి సీన్ లోనూ భారీతనం‌ అనిపిస్తుంది. ట్రైల‌ర్‌లో ఆక‌ర్ష‌ణీయంగా అనిపిస్తోన్న ఈ స‌న్నివేశాలు సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆస‌క్తిని అంద‌రిలోనూ క్రియేట్ చేస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 27న దేవ‌ర చిత్రం తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌లయాళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.