మంగళవారం, 15 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 7 సెప్టెంబరు 2024 (16:14 IST)

ఎన్టీఆర్ దేవర ట్రైలర్ పోస్టర్ తో డేట్ ఫిక్స్

Devara trailer poster
Devara trailer poster
ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న “దేవర” కోసం ఒక్కో అప్ డేట్ ఇచ్చేస్తున్నారు .ఈనెలాఖరులో సినిమా విడుదలకాబోతున్న సందర్భంగా ఇప్పటికే యు.ఎస్. లో హాట్ గా టిక్కట్లు బుక్ అయిన విషయం తెలియజేశారు. తాజాగా వినాయకచవితి సందర్భంగా  దేవర ట్రైలర్ పోస్టర్ తో డేట్ ఫిక్స్ చేశారు. దేవర లుక్ లో ఒక మాస్ అండ్ పవర్ఫుల్ పోస్టర్ ని రివీల్ చేసి ట్రైలర్ ఈ సెప్టెంబర్ 10నే వస్తున్నట్టుగా అనౌన్స్ చేసేసారు.
 
రెండు భాగాలుగా విడుదలకాబోతున్న ఈ సినిమా మొదటి భాగం ఈ సెప్టెంబర్ 27న గ్రాండ్ గా పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఇటీవలే జాన్సీ కపూర్ తో చేసిన దావురా సాంగ్ కూడా మంచి స్పందన వచ్చింది. ఇందులో జాన్వీ కాస్త బోల్డ్ డాన్స్ వేసినట్లుగా కనిపిస్తుంది.  ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వహిస్తున్నారు.