గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 ఆగస్టు 2024 (13:53 IST)

దేవర నుంచి రెండో సింగిల్.. రికార్డుల వేట.. కానీ ట్రోల్స్ మొదలు

Devara
దేవర నుంచి రెండో సింగిల్ వచ్చేసింది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన చుట్ట మల్లె సాంగ్ విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది.. పాటను రిలీజ్ చేసిన చిత్ర బృందం 24 గంటల్లోనే రికార్డును సృష్టించింది.. యూట్యూబ్‌లో రిలీజ్ అయిన 24 గంటల్లోనే అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు పాటల్లో దేవర చుట్టమల్లె సాంగ్ మూడవ స్థానంలో నిలిచింది.
 
ఈ పాటకు 15.68 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ సాంగ్ 40 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి గీత రచయితగా అనిరుద్ సంగీత దర్శకత్వంలో సూపర్ హిట్ సొంతం చేసుకుంది.
 
ఇక ఈ సినిమా మొదటి సాంగ్ కూడా ఓ రేంజ్‌లో దూసుకెళ్లిపోతోంది. అయితే కొంద‌రు మాత్రం ఈ పాట‌ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ పాట సోప్ యాడ్‌ని తలపిస్తుందని , వాటిని సంబంధించిన సీన్స్ క‌ట్ చేసి మీమ్స్ చేస్తూ ఎద్దేవా చేస్తున్నారు. ఎడిటింగ్ వీడియోలతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.