ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 జూన్ 2024 (15:48 IST)

కూటమికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు.. బాబు, పవన్‌తో పాటు అత్తమ్మకు..

NTR_Kalyan Ram
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఘన విజయం సాధించిన కూటమికి అభినందనలు తెలిపారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. సోషల్ మీడియా అగ్రగామి ఎక్స్ వేదికగా.. చంద్రబాబు, నారా లోకేష్, బాలకృష్ణ, శ్రీభరత్, పురందేశ్వరిలకు.. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 
 
"మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు… మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను. 
Babu_NTR
Babu_NTR
 
అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ గారికి అభినందనలు. మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి.. ఎంపీలకు, శ్రీ భరత్‌కు, అత్తకి నా శుభాకాంక్షలు అంటూ ఎన్టీఆర్ తెలిపారు. 
 
అలాగే పిఠాపురంలో ఘనవిజయం సాధించిన పవన్ కళ్యాణ్‌గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు.." అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. 
Pawan_NTR
Pawan_NTR
 
జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు ఆయన సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఎక్స్ వేదికగా నందమూరి ఫ్యామిలీ విజేతలతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.