శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (09:41 IST)

దేవరలో దావుడి పాట అందరినీ కదిలించేలా చేస్తుంది

NTR, Janvi
NTR, Janvi
ఎన్టీఆర్ హీరోగా జాన్వీకపూర్ నాయికగా నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” లో ఇటీవలే ఒక్కోపాట విడుదల చేశారు. అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈనెల  4వ తేదీన దావుడి పాట అందరినీ కదిలించేలా చేస్తుంది అంటూ చిత్ర టీమ్ పోస్ట్ చేసింది. జాన్వీ, ఎన్. టి. ఆర్. డాన్స్ వేస్తున్న కొత్త స్టిల్ ను విడుదల చేసింది. ఇటీవలే గీత రచయిత రామజోగయ్య శాస్త్రి కూడా తన సోషల్ మీడియాలో ఈసారి పాట మామూలుగా వుండదు. మెలోడీతో కూడిన పాట అద్భుతంగా వచ్చిందని అన్నారు. 
 
ప్రస్తుతం  దేవర సెకండ్ సింగిల్ చుట్టమల్లే నమోదు చేసిన భారీ రికార్డు కోసం వైరల్ అవుతుంది. ఇక మూడో పాట ఎదురులేని డ్యాన్స్ బ్లేజ్ కోసం బీట్‌లు సెట్ చేయబడ్డాయి అంటూ కాప్షన్ జోడించింది. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.