గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 20 ఆగస్టు 2024 (11:30 IST)

దేవర షూట్ లో ఎన్.టి..ఆర్. ప్రవేశం - దేవర తార్డ్ సాంగ్ లీక్?

Jahnvi,ntr
Jahnvi,ntr
ఎన్.టి..ఆర్. నటిస్తున్న దేవర సినిమా. కొరటాల శివ దర్శకుడు. ఇటీవలే కొంత గేప్ తీసుకున్నాడు. ఎన్.టి..ఆర్.. జిమ్ లో కసరత్తు చేస్తుండగా ఎడమ చేయికి చెందిన మడమ బెణకడంతో కొద్దిరోజులు విశ్రాంతా అవసరం అని డాక్టర్లు చెప్పడంతో ఆయన విరామం తీసుకున్నారు. ఇక తాజా సమాచారం మేరకు ఎన్.టి..ఆర్. షూట్ లో పాల్గొంటున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు మాదాపూర్ లోని అల్యూమినియం ఫ్యార్టీలో యాక్షన్ సీన్స్ చిత్రీకరణ జరుగుతోంది. అందులో ఎన్.టి..ఆర్. పాల్గొంటున్నారు. 
 
ఇదిలా ఉండగా,  దేవర సినిమాలోని మూడో పాట కు చెందిన థీమ్ లీక్ అయిందని సోషల్ మీడియాలో దేవర టీమ్ పేర్కొంది. అందులో ఆయుద పూజ సాంగ్.. దేవర.. 27 సెకన్ల సాంగ్ లీక్.. అయినట్లు ఆ మ్యూజిక్ ను వింటే అక్కడ షూటింగ్ లో పాల్గొన్న వారు ఫోన్ లో రికార్డ్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఈ సినిమాకు  అనిరుద్ మ్యూజిక్ అందించారు. కాగా, ఈనెలలో కొంత భాగాన్ని ఫ్యాక్టరీలో చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. జాన్వీకపూర్ నాయికగా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్  27న  విడుదలకాబోతుందని ఇప్పటికే ప్రకటించారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.