గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 28 ఆగస్టు 2024 (10:56 IST)

దేవర లేటెస్ట్ స్టిల్ వచ్చింది - వినాయకచవితి తర్వాత ప్రమోషన్ షురూ

Devara latest
Devara latest
ఎన్ టి.ఆర్. నటిస్తున్న దేవర సినిమాకు సంబంధించి ఏదో ఒక అప్ డేట్ కావాలని అభిమానులు సోషల్ మీడియాలో కోరుతున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా రూపొందుతోన్న ఈ సినిమా తాజాగా నేడు కొత్త స్టిల్ ను విడుదల చేశారు. ఎన్. టి.ఆర్. రెండు ముఖాలుగా వున్న ఈ స్టిల్ సీరియస్ గా చూస్తున్నట్లుంది.

ఇకపోతే కొరటాల శివ తన మార్క్ కు తగినట్లుగానే యాక్షన్ అండ్వంచర్ గా ఈ సినిమా వుండబోతోంది. బాలీవుడ్ తోపాటు హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్లు, సాంకేతిక సిబ్బంది పనిచేస్తున్న ఈ చిత్రం ప్రమోషన్ ను సెప్టెంబర్ 7 తర్వాత మొదలు పెట్టనున్నట్లు సమాచారం. 
 
 ట్రైలర్ ని సెప్టెంబర్ 15కి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో సినిమా రిలీజ్ కాబోతుంది. కాగా, ఈ చిత్రం అరేబియన్ సముద్ర దొంగల నేపథ్యం అన్న విషయం తెలిసిందే. అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్,  సైఫ్ అలీ ఖాన్ తదితరులు ఇందులో నటిస్తున్నారు. రెండు భాగాలుగా రాబోతోంది ఈ చిత్రం.