గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 31 ఆగస్టు 2024 (15:17 IST)

మంగుళూరు ఎయిర్ పోర్ట్ లో నంద‌మూరి తారక రామారావు, రిషభ్ శెట్టి కలిసిన వేళ

Rama Rao, Rishabh Shetty
Rama Rao, Rishabh Shetty
నేడు మంగుళూరు ఎయిర్ పోర్ట్ లో నంద‌మూరి తారక రామారావు, రిషభ్ శెట్టి కలిసిన వేళ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఫ్యాన్స్ లో ఆనందహేళ మొదలైంది. రిషబ్ శెట్టికి కాంతార చిత్రానికి కాను జాతీయ స్థాయి అవార్డు దక్కింది. ఇక ఆర్.ఆర్.ఆర్. లో రామారావుకు ప్రపంచ గుర్తింపు వచ్చింది. దాంతో బాలీవుడ్ లో వార్-2 సినిమాను రామారావు చేస్తున్నాడు. మరోవైపు తెలుగులో చేస్తున్న దేవర సెప్టెంబర్ లో విడుదలకు సిద్ధం చేస్తున్నారు నిర్మాతలు. 
 
కాగా, ఇటీవలే జిమ్ లో కసరత్తు చేసి ఎడమచేయి బెణకడంతో రెస్ట్ తీసుకున్న రామారావు ఇప్పుడు బయటకు రావడంతో మరో షూటింగ్ కు సిద్ధమయినట్లు తెలుస్తోంది. ఇంకొందరైతే కాంతార 2లో ఎన్.టి..ఆర్. గెస్ట్ రోల్ చేస్తున్నాడమోనని అనుమానం కూడా వ్యక్తం చేశారు. ఏది ఏమైనా వీరిద్దరి కలయిక ఆనందంగా వుందనే చెప్పాలి. కాగా, బెంగుళూరుకు ఎన్టీఆర్ త‌న అమ్మమ్మ ఊరు వెళుతున్న‌ట్లు తెలుస్తోంది.  రామారావు అమ్మమ్మ వాళ్ల ఊరు మంగుళూరు దగ్గరలోని కుందాపుర. రిషభ్ శెట్టిది కూడా అదే ఊరు. దీంతో ఈ ఇద్ద‌రికి మంచి రిలేషన్ వుందనే టాక్ కూడా నెలకొంది.