సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (17:34 IST)

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ విరాళాలకు మంచి స్పందన

Anil, Ram Laxman and others
Anil, Ram Laxman and others
ఆంధ్రపదేశ్ లో వరద భీభత్సం గురించి తెలిసిందే.  ప్రతిఒక్కరూ ఏదో విధంగా సాయం అందిస్తూనే వున్నారు. ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నుండి వరద బాధితుల సహాయార్థం విరాళాల సేకరణకు అన్నపూర్ణ ఏడెకాలతోపాటు పలు  షూటింగ్ లొకేషన్స్ కి వెళ్ళగా అందరూ సానుకూలంగా స్పందించారు. ఫెడరేషన్ వారు చేయుచున్న ఈ ప్రయత్నం చాలా మంచి కార్యక్రమమని మా వంతు మేము సహాయం చేస్తామనీ, అలాగే ప్రతి ఒక్కరు సహకారం అందించాలని ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ పిలుపు ఇచ్చారు.
 
అదేవిధంగా ప్రభాస్ తో రాజాసాబ్ సినిమా చేస్తున్న డైరెక్టర్ మారుతీ, డైరెక్టర్ బాబీతో పలువురు తగు విధంగా సాయం చేస్తున్నట్లు ప్రకటించారు. ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ లో మెంబర్సు, కాని మెంబర్స్ ఎంతమంది షూటింగ్ లో వున్నారనే విషయాలను కూడా పరిశీలించారు. దీనిపై త్వరలో ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.