సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 11 నవంబరు 2023 (11:59 IST)

నాకు వ్యక్తిగతంగా తీరని లోటు : మెగాస్టార్ చిరంజీవి

chiru-chandrmohan
chiru-chandrmohan
చంద్రమోహన్ మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 'సిరిసిరిమువ్వ', 'శంకరాభరణం', 'రాధాకళ్యాణం', 'నాకూ పెళ్ళాం కావాలి' లాంటి అనేక  ఆణిముత్యాల్లాంటి  చిత్రాల్లో తన వైవిధ్య నటనా కౌశలం ద్వారా  తెలుగు  వారి  మనస్సులో చెరగని ముద్ర  వేసిన సీనియర్ నటులు, కథనాయకులు చంద్రమోహన్ గారు ఇక లేరని  తెలవడం ఎంతో  విషాదకరం. 
 
chandrmohan
chandrmohan
నా తొలి చిత్రం 'ప్రాణం ఖరీదు' లో  ఒక మూగవాడి పాత్రలో అత్యద్భుతమైన నటన ప్రదర్శించారాయన. ఆ సందర్భంగా ఏర్పడిన మా తొలి పరిచయం, ఆ తర్వాత మంచి స్నేహంగా, మరింత గొప్ప  అనుబంధంగా మారింది. ఆయన సాన్నిహిత్యం ఇక లేకపోవటం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు.   ఆయన ఆత్మకి  శాంతి చేకూరాలని కోరుకుంటూ , ఆయన కుటుంబ  సభ్యులకు , అభిమానులకు నా  ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను.
 
Chantabbi movie
Chantabbi movie
సాయి కుమార్ 
నిజంగా చెప్పుకోదగ్గ వ్యక్తి అయిన #చంద్రమోహన్ గారి గురించి తెలుసుకున్నందుకు చాలా బాధగా ఉంది. ఈ కష్ట సమయంలో నా ఆలోచనలు అతని కుటుంబంతో ఉన్నాయి. ఆయన ఆత్మకు శాశ్వత శాంతి కలగాలని కోరుకుంటున్నాను.

దర్శకుడు మారుతి 
చంద్ర మోహన్ గారు ఇప్పుడు లేరని తెలిసి చాలా బాధగా ఉంది, మామి గోల్డెన్ సినిమాలు మాకు అందించాడు, నిజంగా మేము మిమ్మల్ని మిస్ అవుతున్నాము సార్. ఓం శాంతి