చిరంజీవి ఎందుకు `మా`కు రాజీనామా చేశారో తెలుసా!
Chiranjeevi ph
ఇది జరిగి చాలా కాలం అయింది. మరలా `మా` ఎన్నికలు జరగాల్సివుంది. ఏడాదిన్నరపైగా కాలపరిమితి పూర్తయింది. ఆ సమయంలో కరోనా వల్ల ఎన్నికలు వాయిదా వేశారు. అయితే అంతకుముందు ప్రతి ఏడాది మా డైరీ అనేది విడుదల చేయడం ఆనవాయితీ. అది సీనియర్ నరేశ్ మా అధ్యక్షుడు అయ్యాక అస్సలు జరగలేదు. దీనికితోడు ఆయన మా కార్యాలయానికి సరిగ్గారావడంలేదనీ, బీద కళాకారుల ఫించన్లు ఇతర వాటిపై చెక్‌లపై సంతకాలు చేయడంలేదు. మరలా నరేష్ విమర్శలు వచ్చాయి. కానీ ఆయన అటువంటివి ఏమీ పట్టించుకోకుండా తన పని తానుచేసుకుంటూ పోతున్నారు. దీనితోపాటు పలు సమస్యలు పెండింగ్‌లో వున్నాయి. ఈ విషయంలో సీనియర్ నరేష్ పెద్దలు చెప్పినట్లు అసోసియేషన్‌ను సరిదిద్దుకోవడంలో విఫలం అయ్యాడని సాటి కమిటీ మెంబర్లు ఆరోపణలు చేస్తున్నారు.
ఓ దశలో తాత్కాలిక అధ్యక్షుడిగా నటుడు బెనర్జీకూడా వుండి వ్యవహారాలు చూసుకున్నారు. దానికితోడు సీనియర్ నరేష్ తాను అధ్యక్షుడు అయ్యాక పేద కళాకారుల వివరాలు సేకరించి వారికి మరింత సేవ చేయడానికి కొంతమంది టీమ్‌ను పెట్టి వివరాలు సేకరించాడు. అవి మధ్యంతరంగా ఆగిపోయాయి. ప్రస్తుతం సీనియర్ నరేష్ ఎవరికీ సహకరించడంలేదనీ వాదనలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం ఆయన అహం ఎక్కువగా వుందని సాటివారే ఆరోపిస్తున్నారు.
మా లో ఏదైనా సమస్య వస్తే అందుకు క్రమశిక్షనా సంఘం అధ్యక్షుడిగా చిరంజీవి వ్యవహరిస్తున్నారు. కానీ ఆయన మాట చెల్లుబాటు కాకపోవడంతో తప్పనిసరి పరిస్థితులలో రాజీనామా చేశారు. దీనిపై మాలోని దాదాపు అందరూ బాధను వ్యక్తం చేస్తూ అసలు `మా` అసోసియేషన్ ఏర్పాటుకు కారకులైన మీరే లేకపోతే ఏమిటని ఆయన ముందు వాపోయారు. ఏదైనా కాలమే పరిష్కారం చూపిస్తుందనే విధంగా ఆయన స్పందించారని విశ్వసనీయ సమాచారం.
