మా ఊరి ప్రేమకథ విజయం సాధిస్తుందిః దామోదర ప్రసాద్
maa oori premakatha
ప్రముఖ నిర్మాత కెయల్ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ, ప్రేమకథా చిత్రాలు చాలా వచ్చాయి.. వస్తున్నాయి.. అన్నీ ప్రేమకథలు ఒకటే.. ఏం మారవు. డిఫరెంట్ జోనర్సలో ప్రెజెంటేషన్ కొత్తగా తెస్తే కచ్చితంగా హిట్ అవుతాయి. ఈ చిత్రం ట్రైలర్, సాంగ్స్ చూస్తుంటే రియలిస్టిక్, రా కంటెంట్ తో తీసారనిపిస్తుంది. ఎనర్జిటిక్ లవ్ స్టోరి. ఎమోషన్స్ హైగా ఉన్నాయి. విజువల్స్, కంటెంట్ చిత్రీకరణ చూస్తుంటే ఈ చిత్రం సక్సెస్ కి దెగ్గరలోనే వుందనిపిస్తుంది... ఈ చిత్రం హిట్ అయి మంజునాథ్ కి మంచి పేరు రావాలి అన్నారు..
హీరో, నిర్మాత, దర్శకుడు మంజునాథ్ మాట్లాడుతూ, ఎంతో వ్యయప్రయాసాలకోర్చి ఈ చిత్రం తీశాను.. ఎన్ని కష్టాలు ఎదురైనా.. అవన్నీ లెక్కచేయకుండా ఈ సినిమా తెరకెక్కించాను.. దానికి మా ఫ్యామిలీ ఎంతో సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశారు. అలాగే ఈ సినిమా విషయంలో నాకు అండ దండగా ఉండి ఎంతో సహకరిస్తున్న రామసత్యనారాయణ, సంధ్య స్టూడియో రవి గారికి నా థాంక్స్. విలేజ్ బాక్డ్రాప్ లో జరిగే యాక్షన్, లవ్ ఎంటర్టైనర్ చిత్రమిది.. సెన్సార్ కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యాయి. సినిమా చూసిన వారంతా మంచి సినిమా తీశారని అభినందించారు. ఏప్రిల్ 22న ఈ చిత్రాన్ని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యధిక ధియేటర్సలలో విడుదల చేస్తున్నాం.. అన్నారు.
సంగీత దర్శకుడు జయసూర్య మాట్లాడుతూ.. బ్యూటిఫుల్ లవ్ స్టొరీ ఇది. స్విచ్ వేషన్స్ తగ్గట్లుగా పాటలు రాసి మ్యూజిక్ చేశాను. మంజునాథ్ ఒక మంచి చిత్రాన్ని చేశాడు. ఈ సినిమా సక్సెస్ అయి మా టీమ్ అందరికీ మంచి పేరు తెస్తుంది.. అన్నారు.
కీ మ్యూజిక్ అధినేత రవి కనగాల మాట్లాడుతూ, కీ మ్యూజిక్ ద్వారా 22 సినిమాలు ఆడియో రిలీజ్ చేశాం.. ఈ చిత్రంలోని పాటలు అద్భుతంగా ఉన్నాయి. విజువల్ గా కాంప్రమైజ్ కాకుండా చిత్రీకరించారు. మంజునాథ్ చాలా కష్టపడి ఈ చిత్రాన్ని రూపొందించారు. మంచి సక్సెస్ అయి అతనికి మరిన్ని డబ్బులు రావాలి అన్నారు..
ధర్మవరం రవితేజ మాట్లాడుతూ, మా నాన్నగారు భౌతికంగా లేకపోయినా ఆయన ఆశీస్సులు ఎప్పుడు సినిమా వారికి ఉంటాయి. టైటిల్ చాలా క్యాచీగా ఉంది. ట్రైలర్ అదిరిపోయింది. ఈ సినిమా పెద్ద హిట్ అయి చిత్ర యూనిట్ అందరికీ మంచి పేరు రావాలి అన్నారు.

