శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 30 మార్చి 2021 (21:05 IST)

ఆచార్య ఒక‌రోజు ముందుగానే ప్రోమో (Video)

chiru step
మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న `ఆచార్య‌` సినిమా గురించి వ‌రుస‌గా సంద‌ర్భానుసారంగా ఒక్కోటి విడుద‌ల‌వుతున్నాయి. తాజాగా `లాహెరే.. అనే పాటకు చిరు స్టెప్‌లేస్తున్న స్టిల్‌ను చిత్ర నిర్మాత‌లు విడుద‌ల‌చేశారు. ఇప్పుడు బుధ‌వారంనాడు తొలి పాటను మార్చి 31 సాయంత్రం 4.05 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. అయితే ఈ లాహే లాహే అంటూ సాగే ఈ పాటకు సంబంధించిన చిన్న ప్రోమోను ఒక్కరోజు ముందుగానే అంటే మంగ‌ళ‌వారంనాడు 7గంట‌ల త‌ర్వాత‌ రిలీజ్ చేశారు. నక్సలిజం బ్యాక్‌డ్రాప్ అనగానే చాలా వరకు డాన్సులు, కామెడీ ఉండవని ప్రేక్షకులు ఫిక్స్ అవుతున్న క్రమములో మెగాస్టార్ సర్‌ప్రైజ్ చేశారు.‌
 
కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా రూపొందుతోంది. కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈచిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, రామ్ చ‌ర‌ణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.