సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 27 మార్చి 2021 (16:47 IST)

మెగాస్టార్ `లాహే లాహే..` సాంగ్ ఈనెల 31న బ‌య‌ట‌కు రాబోతుంది

Chiru Acharya song
మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న `ఆచార్య‌` సినిమాకు సంబంధించి అప్‌డేట్స్ ఒక్కోటి బ‌య‌ట‌కు విడుద‌ల చేస్తుంది చిత్ర‌యూనిట్‌. శ‌నివారంనాడు రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చిరు, చ‌ర‌ణ్ స్టిల్‌ను విడుద‌ల చేసింది. నక్సల్ గెటప్స్ లో తుపాకులు పట్టుకొని నడుచుకుంటూ వస్తున్నారు. చిరు వెనుక చరణ్ కనిపిస్తూ అదనపు బలంగా కనిపిస్తున్నాడు. మొత్తానికి మాత్రం ఇది డబుల్ మెగా ట్రీట్ అనే చెప్పాలి.

ఇక ఇదేరోజు సాయంత్రం 4.05గంట‌ల‌కు ఆచార్య నుంచి మెగాస్టార్ `లాహేలాహే..` అంటూ స్టెప్‌లు చేస్తూ వున్న స్టిల్‌ను విడుద‌ల చేసింది. బేక్‌డ్రాప్‌లో హ‌రిదాసులు కూడా నృత్యం చేస్తూ వున్న ఈ స్టిల్ ఉత్స‌వంలో పాట‌గా అనిపిస్తుంది. ఈ పాట‌ను ఈనెల 31న సాయంత్రం 4.05 నిముషాల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. చిరంజీవి డాన్స్ చేస్తున్న ఈ స్టిల్ అభిమానుల‌ను అల‌రించింది. మొత్తంగా పాట విడుదలైతే చిరు స్టెప్‌ల‌తో ఇర‌గ‌తీస్తాడంటూ అభిమానులు ఇప్ప‌టికే ట్విట్ట‌ర్‌లో స్పందిస్తున్నారు.
ఇక ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, మరియు పూజా హెగ్డే లు హీరోయిన్స్ గా నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అలాగే మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బేన‌ర్ పై నిరంజ‌న్ రెడ్డి నిర్మిస్తున్నారు.