నిజ సంఘటనతో వైల్డ్ డాగ్
హైదరాబాద్‌లో జరిగిన నిజ సంఘటన ఆధారంగా తీసిన సినిమా `వైల్డ్‌డాగ్` అని నాగార్జున స్పష్టం చేశారు. ఈ సినిమాకోసం 18నెలలు కష్టపడ్డామన్నారు. ఏప్రిల్2న సినిమాను విడుదలచేస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం ఈ సినిమా గురించి ఆయన మాట్లాడారు. నిర్మాత నిరంజన్‌రెడ్డి క్షణం, గగనం, గాజి సినిమాలను తీశాడు. దర్శకుడు సాల్మన్ `ఊపిరి` సినిమాకు పనిచేశాడు. అప్పుడే ఆయనతో సినిమా చేయాలనుకున్నా. ఇక ఈ సినిమాకథ హైదరాబాద్‌లోని బాంబ్‌బ్లాస్ట్‌లు జరిగిన విషయం తెలిసిందే. చేసిన వారిని ఎలా పట్టుకున్నారనే కథను సాల్మన్ అద్భుతంగా తీశాడు.
ఈ సినిమాకోసం వెపన్స్ కొన్ని ఒరిజినల్స్ వాడాం. ఇందులో మంచి డైలాగ్స్ వున్నాయి. వైల్డ్‌డాగ్ మిషన్ అనేది సీక్రెట్ ఆపరేషన్. ఇలా దేశం కోసం పనిచేసేవారు పేరులు బయటకురావు. పోతే తెలియదు కూడా. కానీ దేశం కోసం ప్రాణాలు అర్పించే మనుషుల కథ. ఈ సినిమాను నవంబర్‌లో పూర్తయింది. ఓటీటీలో విడుదల అనుకున్నాం. కానీ ఆతర్వాత జరిగిన పరిణామాలవల్ల సంక్రాంతి నుంచి వచ్చిన సినిమాల ఆదరణ చూసి ఇలాంటి మంచి సినిమాను పెద్ద తెరపై చూడాలని అనుకుని ఏప్రిల్2న విడుదల చేయడానికి సిద్ధం చేశాం అని చెప్పారు.