మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 ఫిబ్రవరి 2021 (13:20 IST)

ఆయన మాకు దేవదూత.. సల్లూభాయ్‌కి రాఖీ సావంత్ తల్లి

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌లో మంచి మానవతా వాది కూడా దాగి ఉన్నారనే సంగతి తెలిసిందే. ఎందరికో ఎన్నో సార్లు సాయపడ్డ సల్లూభాయ్ ఇటీవల క్యాన్సర్ చికిత్స పొందుతున్న నటి రాఖీ సావంత్ తల్లి జయ క్యాన్సర్ చికిత్స కోసం ఆర్థిక సాయం అందించారు.
 
ఈ క్రమంలో రాఖీ సావంత్ తల్లి సల్మాన్‌తో పాటు ఆయన సోదరుడు సోహైల్ ఖాన్‌కు ధన్యవాదాలు తెలాపారు. తన తల్లి మాట్లాడిన వీడియోని రాఖీ సావంత్ తన ఇన్‌స్టాగ్రాములో షేర్ చేస్తూ సల్మాన్ ఖాన్, బిగ్ బాస్ 14లను ట్యాగ్ చేసింది.
 
ఇటీవల రాఖీ సావంత్ తన తల్లి ఆసుపత్రి ఖర్చుల కోసం సల్మాన్ అతని సోదరుడు సోహైల్ వైద్య ఖర్చులకు సాయం చేస్తున్నారని పేర్కొన్న సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ ఎక్కు సాయం అందించగా, ఆయన మాకు దేవదూత అని పేర్కొంది. 
 
సోదరులిద్దరు డాక్టర్స్‌తో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ చికిత్సకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. సల్మాన్ సార్ లాంటి సోదరుడు మాకు దొరకడం దేవుడి ఆశీర్వాదం అని రాఖీ సావంత్ పేర్కొంది. రాఖీ ఇటీవల బిగ్‌బాస్-14 కార్యక్రమంలో పాల్గొనగా, ఫిబ్రవరి 21న జరిగిన ఫైనల్ ఎపిసోడ్లో ఆమె రూ. 14 లక్షల మొత్తంతో ప్రదర్శన నుండి బయటకు వచ్చింది.