క్రికెట్ చరిత్రలో లేని సూపర్ క్యాచ్.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు...
క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సూపర్ క్యాచ్ నమోదైంది. సరిగ్గా అలాంటి ఓ విచిత్ర ఘటనే అబుదాబిలో జరిగింది. ఈ క్యాచ్ చూసిన వారికి చూసే ఫ్యాన్స్‌కు ఒళ్లు మండుతుంది. అబుదాబి టీ10 లీగ్ చాలా సీరియస్‌గా జరుగుతున్న వేళ అబుదాబి ఫీల్డర్ రోహన్ ముస్తఫా తన చెత్త ప్రవర్తనతో గేమ్ సీరియస్‌నెస్‌ను పోగొట్టాడు. క్రికెట్‌నే అపహాస్యం చేసేలా వ్యవహరించాడు.
వివరాల్లోకెళితే.. అబుదాబి టీం, నార్త్రన్ వారియర్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. సెకండ్ ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో.. రోహన్ ముస్తఫా ఫీల్డింగ్ సమయంలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్ కొట్టిన షాట్ ముస్తఫా వైపు ఉన్న బౌండరీ లైన్ వైపు వచ్చింది. ఆ సమయంలో విప్పేసిన షర్ట్ వేసుకుంటూ ముస్తఫా బంతి వెంట పరుగులు తీశాడు.
ఆ బంతి బౌండరీ లైన్‌ను తాకి ఫోర్ వెళ్లింది. ఫోర్ వెళ్లకుండా ఆపకపోగా, ముస్తఫా వ్యవహరించిన తిక్క వైఖరికి ప్రత్యర్థి జట్టు ఆటగాడు నికోలస్ పూరన్ నవ్వాపుకోలేకపోయాడు. సొంత టీం సభ్యులు కూడా నవ్వారు.
ముస్తఫా షర్ట్‌లెస్ ఫీల్డింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ' ద్యావుడా.. ఇదేం ఫీల్డింగ్' అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో వారియర్స్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగిన షేక్ జాయెద్ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదికైంది.