మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 జనవరి 2021 (12:30 IST)

ఇండియన్ ప్లేయర్స్‌పై జాత్యంహకార వ్యాఖ్యలు నిజమే..

ఇండియన్ ప్లేయర్స్‌పై ఆస్ట్రేలియా అభిమానులు జాత్యంహకార వ్యాఖ్యలు చేసిన మాట వాస్తవేమనని క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది. సిడ్నీ టెస్ట్ మూడో రోజు ఆటలో టీమిండియా ప్లేయర్స్ జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లపై ఆసీస్ ఫ్యాన్స్ నోరు పారేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన క్రికెట్ ఆస్ట్రేలియా.. ఆ ఘటన నిజమేనని తేల్చింది. 
 
ఈ మేరకు తమ విచారణ నివేదికను ఐసీసీకి క్రికెట్ ఆస్ట్రేలియా అందజేసినట్లు బోర్డుకు చెందిన ఇంటిగ్రిటీ అండ్ సెక్యూరిటీ హెడ్ సీన్ కారల్ వెల్లడించారు. అయితే తమ విచారణ ఇంకా కొనసాగుతుందని, ఈ వ్యాఖ్యలు చేసిన అభిమానులను గుర్తిస్తున్నామని చెప్పారు. సీసీటీవీ ఫుటేజీ, టికెటింగ్ డేటా పరిశీలించడంతోపాటు ప్రేక్షకులతో మాట్లాడి దీనికి కారణమైన వాళ్లను గుర్తిస్తామని తెలిపారు. వాళ్లపై దీర్ఘకాల నిషేధం విధిస్తామని స్పష్టం చేశారు.ే