శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 అక్టోబరు 2020 (15:50 IST)

భారత్ - ఆస్ట్రేలియా క్రికెట్ సిరీస్ : పూర్తి షెడ్యూల్ ఇదే...

భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 13వ సీజన్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ సేన ఆసీస్‌కు బయలుదేరివెళ్లనుంది. ఈ పర్యటన కోసం ఇప్పటికే బీసీసీఐ జాతీయ సెలెక్టర్లు వన్డే, టీ20, టెస్టు ఫార్మెట్లకు వేర్వేరుగా జట్లను ప్రకటించారు. 
 
తాజాగా ఆస్ట్రేలియాలో టీమ్‌ఇండియా పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు(సీఏ) విడుదల చేసింది. అడిలైడ్‌లో డే/నైట్‌ టెస్టు మ్యాచ్‌ జరగనుంది. నవంబర్‌ 27 నుంచి పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీస్‌ సిడ్నీ, కాన్‌బెర్రాలో నిర్వహించనున్నారు. డిసెంబర్ 17 నుంచి నాలుగు టెస్టుల సిరీస్‌ ఆరంభంకానుంది. 
 
డిసెంబర్‌ 27న సంప్రదాయ బాక్సింగ్‌ డే టెస్టు(రెండో టెస్టు) మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో జరుగుతుంది. జనవరి 7 నుంచి ఎస్‌సీజీలో మూడో టెస్టు మొదలుకానుంది. నాలుగో టెస్టు జనవరి 15 నుంచి బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా నిర్వహించనున్నారు. సుదీర్ఘ ఆసీస్‌ పర్యటన కోసం విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు నవంబర్‌ 12వ తేదీన సిడ్నీ నగరంలో అడుగుపెట్టనుంది. 
 
కాగా, షెడ్యూల్ వివరాలను పరిశీలిస్తే, 
వన్డేలు...
నవంబరు 27 - తొలి వన్డే - డే అండ్ నైట్  (ఎస్సీజీ మైదానం)
నవంబరు 29 - రెండో వన్డే - డే అండ్ నైట్  (ఎస్సీజీ మైదానం)
డిసెంబరు 2 - మూడో వన్డే - కాన్బెరా (డే అండ్ నైట్)
 
ట్వంటీ20లు... 
డిసెంబరు 4 - తొలి టీ20.. కాన్బెరా (నైట్)
డిసెంబరు 6 - రెండో టీ20.. ఎస్సీజీ గ్రౌండ్ (నైట్)
డిసెంబరు 8 - మూడో టీ20.. ఎస్సీజీ గ్రౌండ్ (నైట్)
 
టెస్టులు... 
డిసెంబరు 17-21 - తొలి టెస్ట్ మ్యాచ్.. అడిలైడ్ ఓవర్ (డే అండ్ నైట్)
డిసెంబరు 26-30 - రెండో టెస్ట్ మ్యాచ్ ... మెల్‌బోర్న్ క్రికెట్ మైదానం
జనవరి 7-11 - మూడో టెస్ట్ మ్యాచ్.. ఎస్సీజీ గ్రౌండ్ 
జనవరి 15-19 - నాలుగో టెస్ట్ - బ్రిస్బేన్