శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 22 జనవరి 2021 (16:07 IST)

మీ అమ్మతో బాగా ఎంజాయ్ చేసానన్న ఫ్రెండ్, కళ్లు పీకేశాడు

వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. చిన్నతనం నుంచే ఒకే స్కూల్లో చదువుకున్నారు. విద్య అభ్యసించక మద్యలోనే మానేసి టీ మాస్టర్లుగా మారిపోయారు. అయితే డబ్బులు బాగానే సంపాదించే మాస్టర్లు తాగుడుకు అలవాటు పడ్డారు. ఇద్దరూ కూడా టీ షాపును మూసేసిన తరువాత ప్రతిరోజు మద్యం సేవించే వారు. కానీ మద్యం మత్తులో స్నేహితుడి తల్లితోనే ఎఫైర్ పెట్టుకున్నట్లు చెప్పడంతో చివరకు ఇద్దరి మధ్య తగాదా ప్రాణాల మీదకు తెచ్చింది. 
 
తమిళనాడు రాష్ట్రం తెన్‌కాశి జిల్లాలోని నీలితనల్లూరు సమీపంలోని బాలాపతిపురంకు చెందిన అశోక్ చక్రవర్తి, పెరియ పాండియన్ ఇద్దరూ మంచి స్నేహితులు. వారు చెన్నైలోని మెరీనా బీచ్ సమీపంలో సంవత్సరం క్రితం వచ్చి చేరారు. వారి తల్లిదండ్రులు అక్కడే ఉంటున్నారు.
 
వీరి తల్లిదండ్రులు మత్స్యకారులు. వారు చేపలు పట్టుకుని జీవిస్తుంటే.. వీరిద్దరు మాత్రం టీ మాస్టర్లుగా పనిచేస్తున్నారు. ఒకే వీధిలో పక్క పక్కన హోటళ్ళలో వీరు టీ మాస్టర్లుగా ఉంటున్నారు. రోజుకు వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నారు. పెళ్ళిళ్ళు కాకపోవడంతో వచ్చిన డబ్బులో సగంకి పైగా తాగి తిరిగుతూ ఉండేవారు.
 
అయితే రెండురోజుల క్రితం మద్యం మత్తులో పెరియపాండియన్ తల్లి గురించి చెడుగా చెప్పడం ప్రారంభించాడు. మీ అమ్మ చాలా అందంగా ఉంటుంది. మీ అమ్మతో చాలాసార్లు ఎంజాయ్ చేశానన్నాడు. అయితే పెరియ పాండియన్ మాత్రం దాన్ని పెద్దగా పట్టించుకోలేదు.
 
తాగిన మత్తులో ఏదో వాగుతున్నాడు అనుకున్నాడు. కానీ నిన్న కూడా ఇదే విధంగా అశోక్ చక్రవర్తి మాట్లాడటంతో పెరియ పాండియన్‌కు కోపం కట్టలు తెంచుకుంది. ఇంకేముంది తాగిన క్వార్టర్ బాటిల్‌ను పగులగొట్టి అతని రెండు కళ్ళు పీకేశాడు. చావుబతుకుల మధ్య కొట్టుకుంటున్న అశోక్ చక్రవర్తిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే ఎక్కువగా రక్తస్రావం కావడంతో ప్రస్తుతం అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.