మంగళవారం, 19 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 జనవరి 2021 (12:57 IST)

టీమిండియాకు ఇంగ్లండ్ ఫ్రెండ్లీ వార్నింగ్.. అసలైన ఛాలెంజ్ ముందుంది...

భారత క్రికెట్ జట్టుకు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఫ్రెండ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఆస్ట్రేలియాపై సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న భారత జట్టు ప్రస్తుతం సంబరాల్లో మునిగితేలుతోంది. ఈ క్రమంలో కెవిన్ పీటర్సన్ హిందీలో మాట్లాడుతూ ఇచ్చిన స్వీట్ వార్నింగ్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వ‌ర‌లోనే భారత్‌కు ఇంగ్లండ్ జట్టు రానుంది. ఈ పర్యటన నేపథ్యంలో పీటర్సన్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు కలకలం రేపుతున్నాయి. 
 
"ఇండియా.. ఈ చారిత్ర‌క విజ‌యాన్ని బాగా సెల‌బ్రేట్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఎన్నో అడ్డంకుల మ‌ధ్య సాధించిన విజ‌యం. కానీ అస‌లు సవాలు మీకు కొన్ని వారాల్లో ఎదురు కాబోతోంది. ఇంగ్లండ్ టీమ్ వ‌స్తోంది. ఆ టీమ్‌ను మీ సొంత‌గ‌డ్డ‌పై ఓడించాల్సి ఉంటుంది. జాగ్ర‌త్త‌, ఈ రెండు వారాల్లో మ‌రీ ఎక్కువ‌గా సెల‌బ్రేట్ చేసుకోవ‌ద్దు" అని పీట‌ర్స‌న్ హిందీలో ట్వీట్ చేశాడు. 
 
నాలుగు టెస్ట్‌లు, ఐదు టీ20లు, మూడు వ‌న్డేల్లో ఆడ‌టానికి ఇంగ్లండ్ టీమ్ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి టెస్ట్ ఫిబ్ర‌వ‌రి 5న చెన్నైలో ప్రారంభంకానుంది. ఇప్ప‌టికే తొలి రెండు టెస్ట్‌ల కోసం టీమ్‌ను ప్ర‌క‌టించారు. 
 
ఆస్ట్రేలియా టూర్ మ‌ధ్య‌లోనే వెళ్లిపోయిన విరాట్ కోహ్లి మ‌ళ్లీ కెప్టెన్సీ వ‌హించ‌నుండ‌గా.. పాండ్యా, ఇషాంత్ శ‌ర్మ తిరిగి టీమ్‌లోకి వ‌చ్చారు. తొలి రెండు టెస్ట్‌లు చెన్నైలో, ఆ త‌ర్వాతి రెండు టెస్టులు, టీ20లు అహ్మ‌దాబాద్‌లోని మొతేరాలో, మూడు వ‌న్డేలు పుణెలో జ‌ర‌గ‌నున్నాయి.