సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (12:38 IST)

నేను అనుకున్న‌ట్లే 'ప‌చ్చీస్'తో వ‌స్తున్నాడుః నాగార్జున‌

Nagarjuna, Rams, Swetavaram, etc
ఆవాసా చిత్రం, రాస్తా ఫిలిమ్స్ ప‌తాకాల‌పై కౌశిక్ కుమార్ క‌త్తూరి, రామ‌సాయి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'ప‌చ్చీస్'‌. ఆద్యంతం ఉత్కంఠ‌త‌ను రేకెత్తించే క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి శ్రీ‌కృష్ణ‌, రామ‌సాయి సంయుక్తంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కాస్ట్యూమ్ డిజైన‌ర్ అయిన రామ్స్ ఈ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. శ్వేతా వ‌ర్మ హీరోయిన్‌.
 
'ప‌చ్చీస్' టైటిల్ లోగో, ఫ‌స్ట్ లుక్‌ను నాగార్జున ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, "ఆవాసా చిత్రం, రాస్తా ఫిలిమ్స్ క‌లిసి రామ్స్ హీరోగా నిర్మిస్తోన్న 'ప‌చ్చీస్' మూవీ మంచి హిట్ట‌వ్వాల‌ని కోరుకుంటున్నాను. టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ బాగున్నాయి. రామ్స్ నాకు ప‌దేళ్ల నుంచీ తెలుసు. నా 'ర‌గ‌డ' చిత్రానికి ప‌నిచేశాడు. వెరీ హార్డ్‌వ‌ర్కింగ్‌, వెరీ క్రియేటివ్‌. ఎప్పుడూ కాస్ట్యూమ్ డిజైనింగే చేస్తాడా లేక సినిమాల్లోకి వ‌స్తాడా! అని మ‌నసులో అనుకొనేవాడ్ని. నేను అనుకున్న‌ట్లే ఇప్పుడు 'ప‌చ్చీస్' సినిమాతో హీరోగా వ‌స్తున్నాడు. క‌చ్చితంగా ఇది అత‌నికి స‌క్సెస్ నిస్తుంద‌ని నాకు తెలుసు. డైరెక్ట‌ర్ శ్రీ‌కృష్ణ‌కు మంచి పేరు, విజ‌యం ద‌క్కాల‌ని ఆశిస్తున్నాను" అన్నారు.
టైటిల్ లోగో, ఫ‌స్ట్ లుక్‌ల‌ను హీరో నాగార్జున‌ లాంచ్ చేసినందుకు హీరో రామ్స్‌, డైరెక్ట‌ర్ శ్రీ‌కృష్ణ ధ‌న్య‌వాదాలు తెలిపారు. అన్న‌పూర్ణ ఫిల్మ్ స్కూల్‌కు చెందిన ఆరేడుగురు స్టూడెంట్స్ ఈ సినిమాకు వ‌ర్క్ చేశార‌ని వారు చెప్ప‌డంతో నాగార్జున ఆనందం వ్య‌క్తం చేశారు. 
 
రామ్స్ మాట్లాడుతూ, తాను టాలీవుడ్‌లో మ‌‌హేష్ బాబు, జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, నాగార్జున‌, బాల‌కృష్ణ‌, రాణా, నాని, నితిన్‌, జ‌గ‌ప‌తిబాబు, వ‌రుణ్ తేజ్‌, సాయితేజ్‌, రామ్ పోతినేని, సందీప్ కిష‌న్‌, నారా రోహిత్‌, సుధీర్‌బాబు, అల్ల‌రి న‌రేష్‌, నాగ‌చైత‌న్య‌, అఖిల్‌, సుశాంత్‌, బెల్లంకొండ శ్రీ‌నివాస్, అడివి శేష్‌, అల్లు శిరీష్‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణే, న‌వ‌దీప్‌, కోలీవుడ్‌లో సూర్య‌, జ‌యం ర‌వి, బాలీవుడ్‌లో ఆయుష్మాన్ ఖురానా, అమిత్ స‌ద్‌, ఇర్ఫాన్ ఖాన్‌, పంక‌జ్ త్రిపాఠి, క‌ర‌ణ్ సింగ్ గ్రోవ‌ర్‌, అలీ ఫైజ‌ల్‌, సాఖిబ్ స‌లీమ్‌, పుల‌కిత్ స‌మ్రాట్ త‌దిత‌రుల‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేశాన‌ని చెప్పారు.
 
షూటింగ్ పూర్త‌యిన 'ప‌చ్చీస్'‌కు సంబంధించి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు తుదిద‌శ‌లో ఉన్నాయి. త్వ‌ర‌లో చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.