శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మురళీకృష్ణ
Last Updated : మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (12:22 IST)

పాన్ ఇండియా మూవీ బ్ర‌హ్మాస్త్రలో నాగార్జున పార్ట్ ఓవర్..

Nag
హిందీ, తెలుగు, క‌న్న‌డ‌, మ‌ళ‌యాలం, క‌న్న‌డ భాష‌ల్లో తెర‌కెక్కుతున్న పాన్ ఇండియా మూవీ బ్రహ్మాస్త్ర‌. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ రూపొందిస్తున్న ఈ మోస్ట్ ఎవేటింగ్ సినిమాలో కింగ్ నాగార్జున న‌టిస్తున్నారు. అయితే తాజాగా కింగ్ నాగార్జున‌కి సంబంధించిన షూటింగ్ ముగిసిన‌ట్లుగా బ్ర‌హ్మ‌స్త్ర టీమ్ అధికారికంగా ప్ర‌క‌టించారు. 
 
ఇదే విష‌యాన్ని కింగ్ నాగార్జున త‌న అఫీషియల్ ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. బ్ర‌హ్మాస్త్ర వంటి ఇండియాలోనే అతి భారీ బ‌డ్జెట్ సినిమాలో న‌టించ‌డం త‌నకు చాలా ఆనందాన్ని ఇచ్చింద‌ని, ఓ సాధ‌ర‌ణ ప్రేక్ష‌కుడి మాదిరిగా తాను కూడా ఈ సినిమా విడుద‌ల కోసం వేచి చూస్తున్న‌ట్లుగా ట్వీట్ చేశారు నాగ్. 
 
ఈ సినిమాలో నాగార్జునతో పాటు బాలీవుడ్ డ్రీమ్ బాయ్ ర‌ణ‌బీర్ కపూర్, డ్రీమ్ గర్ల్ అలీయ‌భ‌ట్ న‌టిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం బాంబే ఓ భారీ సెట్ లో న‌డుస్తోంది. మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల అవుతాయి. 
Brahmastra
 
తారాగ‌ణం - నాగార్జున‌, ర‌ణ‌బీర్ క‌పూర్, అలీయ‌భ‌ట్
ద‌ర్శ‌కుడు - అయాన్ ముఖ‌ర్జీ