గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (10:14 IST)

మనీలాండరింగ్ కేసులో సచిన్ జోషి అరెస్టు!

మనీలాండరింగ్ కసులో ప్రముఖ నటుడు, నిర్మాత సచిన్ జోషిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ముంబైకి చెందిన ఒంకార్‌ రియల్టర్స్‌ అండ్‌ డెవలపర్స్‌ సంస్థకు వ్యతిరేకంగా నమోదైన మనీ లాండరింగ్‌ కేసులో ఈడీ సోమవారం ఆయనను అదుపులోకి తీసుకుంది. 
 
ప్రత్యేక యాంటీ-మనీ లాండరింగ్‌ కోర్టు.. ఆయనను ఈ నెల 18 వరకు ఈడీ కస్టడిలో ఉండాలని ఆదేశించింది. జేఎంజీ గ్రూపు ప్రమోటరైన జోషి తండ్రి జేఎం జోషి పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. 
 
వీటిలో గుట్కా, పాన్‌ మసాలా, ఇతర ఉత్పత్తులతోపాటు ఆతిథ్యరంగంలో కూడా సేవలు అందిస్తున్నారు. జోషికి సంబంధించిన కార్యాలయాలపై ఆదాయ పన్ను అధికారులు  దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో 1,500 కోట్ల లెక్కించని లావాదేవీలు జరిగినట్లు ఐటీ గుర్తించింది.