గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (09:40 IST)

ఓ నిండు ప్రాణం తీసి ఆమ్లెట్.. ఎక్కడ?

ఆమ్లెట్ ఒకటి ఓ నిండు ప్రాణాన్ని తీసింది. ఆమ్లెట్ కావాలని కోరిన ఓ వ్యక్తిపై దుకాణం యజమాని తన సిబ్బందితో దాడిచేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలోని ఉప్పల్‌లో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, లంగర్‌హౌస్‌కు చెందిన వికాస్‌(35) ప్రైవేటు ఉద్యోగి. పీర్జాదిగూడలో ఉండే స్నేహితుడు బబ్లూతో ఆదివారం సాయంత్రం ఉప్పల్‌లోని మహంకాళి వైన్స్‌కు వెళ్లాడు. పర్మిట్‌ రూంలో మద్యం తాగుతూ ఆమ్లెట్‌ చెప్పారు. 
 
అయితే, రూ.60 చెల్లించాలని దుకాణ నిర్వాహకుడు వికాస్‌ను అడిగాడు. ఈ విషయమై వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన యజమాని దుకాణ సిబ్బందితో వికాస్, బబ్లూలపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ వికాస్‌ మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.