బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 ఫిబ్రవరి 2021 (11:06 IST)

దేశంలో పడిపోయిన బంగారం ధరలు.. ఢిల్లీలో రూ.661 తగ్గింపు

దేశంలో గత రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా మాత్రం ధరలు తగ్గడం విశేషం.  బంగారం ధరలు తగ్గడంతో మహిళలు బంగారం కొనుగోలుపై దృష్టిసారించారు. 
 
దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు దిగివచ్చాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో  10 గ్రాముల ధర రూ.661కి పడిపోయింది. ఈ క్రమంలో శుక్రవారం 10 గ్రాములకు రూ .661 తగ్గి రూ.46,847కు పడిపోయింది. అలాగే వెండి ధర కూడా కిలోకు రూ.347 తగ్గి రూ.67,894 కు చేరుకుంది.
 
ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 తగ్గి రూ.44,250కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.310 తగ్గి రూ.48,290కి చేరింది. ఇక వెండి ధరలు మాత్రం పెరిగాయి. కిలో వెండి ధర రూ. 400 పెరిగి 73,300కి చేరింది. బడ్జెట్‌లో కస్టమ్స్ డ్యూటీని తగ్గించడంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.