మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (22:27 IST)

భార్యతో వేసిన స్టెప్పులేసిన శ్రేయాస్ అయ్యర్.. వీడియో వైరల్

Shreyas Iyer
టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్.. భార్యతో వేసిన స్టెప్పులు వైరల్ అవుతున్నాయి. చాహల్ సతీమణి ధనశ్రీ వర్మతో ఆయనేసిన స్టెప్పులు నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. స్పిన్నర్‌ యుజ్వేంద్ర చహల్ సతీమణి ధనశ్రీ వర్మతో కలిసి శ్రేయస్‌ అయ్యర్‌ తాజాగా అదిరే స్టెప్పులు వేశాడు. 'రోసెస్' సాంగ్‌కు ప్రొఫెషనల్ డ్యాన్సర్‌లా స్టెప్పులు ఇరగదీశాడు. 
 
ఇంకా చెప్పాలంటే.. కొరియోగ్రాఫర్‌ అయిన ధనశ్రీ కంటే కూడా బాగా వేశాడు. ఇద్దరూ కలిసి కాళ్లతో వేసిన స్టెప్పులు వావ్ అనిపిస్తున్నాయి. చివరికి ధనశ్రీ ఆగిపోగా.. శ్రేయస్‌ మాత్రం డాన్స్ వేస్తూనే ఉన్నాడు. దీనికి సంబంధించిన వీడియోను శ్రేయస్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.  
 
శ్రేయస్‌ అయ్యర్, ధనశ్రీ వర్మ డాన్స్ చేసిన వీడియో కొన్ని గంటల్లోనే వైరల్ అయింది. ఇప్పటికే 5 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. టీమిండియా ఆటగాళ్లు చహల్, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌, అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా కూడా శ్రేయస్‌ డ్యాన్స్‌పై ప్రశంసలు కురిపించారు.