గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 ఫిబ్రవరి 2021 (22:16 IST)

రైతు చట్టాలపై కోహ్లీ ట్వీట్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. కెప్టెన్ కాదు.. హిట్ మ్యాన్

రైతు చట్టాలపై క్రికెటర్లు మద్దతు పలుకుతున్నారు. రైతు చట్టాలపై ఢిల్లీలో ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. ఇంకా గణతంత్ర దినోత్సవం నాడు రైతుల ట్రాక్టర్ ర్యాలీ, జరిగిన హింస నేపధ్యంలో రైతు ఆందోళన కొత్త మలుపులు తిరిగింది. రైతులకు బాసటగా కొందరు, చట్టాలకు మద్దతుగా మరి కొందరు నిలిచిన పరిస్థితి. ఇదే సమయంలో సెలెబ్రిటీలు సైతం రెండుగా చీలిపోయారు. 
 
అంతర్జాతీయంగా సెలెబ్రిటీలు రైతు ఆందోళనకు మద్దతుగా నిలిచారు. ఆ తర్వాత టీమిండియా క్రికెటర్లు నోరెత్తారు. దాంతో దేశీయంగా ఉన్న సెలెబ్రిటీలు రైతు చట్టాల్ని సమర్ధించే పనిలో పడ్డారు. మొన్న అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గణ్, సచిన్ టెండూల్కర్, ప్రస్తుతం టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. 
 
హాలీవుడ్ పాప్ సింగర్ రిహన్నా, ప్రపంచ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్, మీనా హారిస్‌లు రైతులకు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా రైతు చట్టాలకు మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం కోహ్లీ చేసిన ట్వీట్ ట్రోల్ అవుతోంది. 
 
అంతేకాదు ఇండియాటుగెదర్ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేశాడు. విభేదాలు తలెత్తిన సమయంలో మనమంతా ఐకమత్యంగా ఉండాలి. రైతులు మనదేశంలో అంతర్భాగం. ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఉద్రిక్తతల పరిష్కారం కోసం అన్ని పార్టీలు , వర్గాలతో చర్చించి స్నేహపూర్వక పరిష్కారంతో శాంతి నెలకొల్పేందుకు సమైక్యంగా ముందుకు వస్తారని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.
 
కోహ్లీ చేసిన ఈ ట్వీట్‌పై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. నువ్వు మా కెప్టెన్ కాదు.. హిట్ మ్యాన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. రెండు పడవల ప్రయాణం మంచిది కాదు.. వివాదాస్పద అంశంలో ఎవరో ఒక్కరికే మద్దతుగా నిలవడం బెటర్ అంటూ కామెంట్లు అందుకున్నారు. రైతుల గురించి నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావ్.. నీకంటే రిహన్నా ఎంతో నయం అని నెటిజన్స్ ట్రోల్ చేశారు.