గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (14:55 IST)

వాళ్లు రైతులు కాదు.. టెర్రరిస్టులు.. కంగనా రనౌత్

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొత్త సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో గత రెండు నెలలుగా ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ రైతుల ఆందోళనపై అమెరికా సింగ‌ర్ రిహానా స్పందించింది. రైతుల ఆందోళ‌న‌కు సంబంధించిన ఓ వార్త‌ను పోస్ట్ చేస్తూ.. మ‌నం దీని గురించి ఎందుకు మాట్లాడుకోవ‌డం లేదు అని రిహానా ట్వీట్ చేసింది. 
 
దీనిపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కాస్త ఘాటుగానే స్పందించింది. దీని గురించి ఎవ‌రూ మాట్లాడ‌టం లేదు. ఎందుకంటే వాళ్లు రైతులు కాదు ఉగ్ర‌వాదులు. వాళ్లు ఇండియాను విభ‌జించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. 
 
అలాంటి ముక్క‌లైన దేశాన్ని చైనా ఆక్ర‌మించి అమెరికాలాగా ఇక్క‌డ కూడా చైనీస్ కాల‌నీ ఏర్పాటు చేయాల‌ని చూస్తున్నారు. మేము మీలాగా దేశాన్ని అమ్ముకోవ‌డం లేదు అంటూ కంగ‌నా ట్వీట్ చేయ‌డం విశేషం.