శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 డిశెంబరు 2020 (18:04 IST)

అజారుద్దీన్‌కు‌ తృటిలో తప్పిన ప్రమాదం...

టీమిండియా మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌కు‌ తృటిలో ప్రమాదం తప్పింది. న్యూ ఇయర్‌ వేడుకల నేపథ్యంలో అజారుద్దీన్‌ బుధవారం తన కుటుంబ సభ్యులతో కలిసి రాజస్థాన్‌కు బయలు దేరారు. అయితే.. రాజస్థాన్‌లోని సుర్వార్‌కు చేరుకోగానే ఆయన కారు అదుపు తప్పి పక్కనున్న ధాబాలోకి దూసుకెళ్లి… పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో అజారుద్దీన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. 
 
అటు ఆయన కుటుంబ సభ్యులు మాత్రం క్షేమంగా బయట పడ్డారు. ధాబాలో పనిచేస్తున్న ఇషాన్‌ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే క్రికెటర్‌ అజారుద్దీన్‌ మరో వాహనంలో హోటల్‌కు వెళ్లిపోయారు. డ్రైవర్‌ బ్రేక్‌ వేసే సమయంలో వాహనం అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు అంటున్నారు. అయితే.. దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.