శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 ఆగస్టు 2020 (10:06 IST)

ప్రమాదానికి గురైన రానా సోదరుడు అభిరామ్ కారు..

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు, రానా సోదరుడు అభిరామ్ దగ్గుబాటి కారు ప్రమాదానికి గురైంది. అయితే పెను ప్రమాదం నుంచి సురేష్ బాబు తప్పించుకున్నట్లైంది.
 
వివరాల్లోకి వెళితే.. మణికొండ కాలనీలోని పంచవటి కాలనీలో ఎదురుగా వస్తున్న కారును అభిరామ్ ప్రయాణిస్తున్న కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే రెండు కార్లు కొద్దిగా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది.
 
ప్రమాదానికి సంబంధించిన విషయం తెలుసుకున్న రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించడంతో పాటు వారికి బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో మద్యం తాగలేదని తేలింది. 
 
ఇటీవల అభిరామ్ ..రానా పెళ్లిలో సందడి చేయగా, అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, అభిరామ్ కూడా వెండితెర ఆరంగేట్రం చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్న తరుణంలో ఇలాంటి కారు ప్రమాదం చోటుచేసుకోవడం దగ్గుబాటి ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేసింది.