శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 31 మార్చి 2021 (17:09 IST)

జానపద గీతాల ట్రెండ్‌లో లాహే.. లాహే.. ఆచార్య నుంచి సింగిల్ సాగ్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి - కాజల్ అగర్వాల్ జంటగా, కొరటాల శివ కాంబినేషన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. ఈ చిత్రం నుంచి తొలి పాటను బుధవారం సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేశారు.
 
"లాహే లాహే"... అంటూ మొదలయ్యే ఈ గీతానికి మణిశర్మ స్వరాలు కూర్చగా, రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. హారిక నారాయణ్, సాహితి చాగంటి ఆలపించారు. 
 
'లాహే లాహే' గీతం ట్యూన్, సాహిత్యం ఇప్పుడొస్తున్న జానపద గీతాల ట్రెండ్‌కు కాస్తంత దగ్గరగానే ఉన్నాయి. ఇందులో సంగీత కూడా డ్యాన్స్ చేసుతంది. చిరంజీవి వేసిన స్టెప్పులు అదిరిపోయేలా ఉన్నాయి. 
 
 'ఆచార్య' చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయిక కాగా, రామ్ చరణ్ కీలకపాత్రలో కనిపిస్తారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాటినీ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్లపై నిర్మితమవుతున్న 'ఆచార్య' చిత్రం మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.