రాజమౌళి రిలీజ్చేసిన `గాలిసంపత్` ట్రైలర్
Rajendra prasad, Sir vishnu
ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ- `ఫన్, ఎమోషన్స్, గ్రేట్ బాండింగ్స్ కంప్లీట్ ప్యాకేజ్. రేపు మార్చి 11న థియేటర్లలో మీరు ఏం చూడబోతున్నారు అనే దానికి చిన్న స్నీక్ పీక్ ఈ ట్రైలర్. గాలి సంపత్ ట్రైలర్‌ని విడుదలచేసిన రాజమౌళిసర్కి ధన్యవాదాలు. మా టీమ్ అంతా ఎంతో సంతోషంగా ఉంది``అన్నారు.
ట్రైలర్లో ఏముందంటే!
`పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు చాలా ఓపిగ్గా ప్రేమగా కరెక్ట్ చేస్తారు. అదేంటో కాస్త మీసాలు వచ్చేసరికి పెద్దొళ్లు ఏం చేసినా ఊరికే చిరాకులు వచ్చేస్తాయి. కోపాలు వచ్చేస్తాయి. నేను కూడా మా నాన్నని కాస్త ఓపిగ్గా ప్రేమగా అడగాల్సింది సార్ అంటూ, సాగే ఈ ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకుంటోంది. ఇందులో రాజేంద్రప్రసాద్ కేవలం ఫిఫీ అనే సౌండ్‌తోనే సంభాషణలు పలకడం విశేషం. ప్రతి అమ్మాయికీ డబ్బున్నోడు కావాలి, లేకపోతే ఫారినోడు కావాలి. డబ్బున్నోడు ఏం ఇస్తాడండీ? డబ్బే ఇస్తాడు. టైమ్ ఎక్కడి నుంచి ఇస్తాడు? అంటూ శ్రీవిష్ణు చెప్పె డైలాగ్ ఇంట్రెస్టింగ్గా ఉంది. `ప్రపంచంలో ఏ తండ్రైనా తన కొడుకు తనకంటే నాలుగు మెట్లు ఎదగాలని చూస్తాడు. నువ్వేంటి నాన్న నన్ను తొక్కి నువ్వు ఎదగాలని చూస్తున్నావు అని శ్రీ విష్ణు చెప్పే డైలాగ్, అలాగే చివరలో ప్రకృతికి ఏం తెలుసు ఎవరు మంచోళ్లో, ఎవరో చెడ్డోళ్లో అని తనికెళ్ల భరణి చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. అచ్చు రాజమణి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

