బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 25 ఫిబ్రవరి 2021 (18:37 IST)

చిరంజీవి రిలీజ్ చేసిన విష్ణు మంచు "మోసగాళ్ళు" ట్రైలర్

Manchu Vishu
మంచు విష్ణు తాజాగా  నటిస్తూ నిర్మించిన చిత్రం "మోసగాళ్ళు". ఏవిఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రెమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో గ్లామర్ బ్యూటీ కాజల్, సునీల్ శెట్టి ముఖ్య పాత్రదారులుగా నటించారు. ఈ చిత్రాన్ని విష్ణు మంచు అత్యంత భారీ బడ్జెట్ తో హై టెక్నికల్ వాల్యూస్ తో నిర్మించారు. రియల్ ఇన్సిడెంట్స్ తో ప్రపంచంలో జరిగిన బిగ్గెస్ట్ ఐటీ స్కామ్తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. కాగా ఈ చిత్రం ట్రైలర్ ని మెగాస్టార్ చిరంజీవి గురువారంనాడు రిలీజ్ చేశారు. 
 
ఈ సందర్బంగా హైదరాబాద్‌లో విలేక‌రుల‌తో మంచు మాట్లాడుతూచ 2015లో ఒక బ్రదర్ అండ్ సిస్టర్ కలిసి ముంబయి, గుజరాత్ లలో ఉండి ఒక సింపుల్ ఐడీయాతో అమెరికా డబ్బుని 4వేల కోట్ల స్కామ్ చేశారు. అది ఎలా చేశారు. ఆ డబ్బు ఎక్కడుంది.. ఇంతకీ వాళ్ళు దొరికారా? లేదా? అనే ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ తో ఈ చిత్రాన్ని చేశాం. యుయస్.లో ఉండి ఈ కథని డెవలప్ చేశాం. అమెరికాలో నిజంగా జరిగిన కథ ఇది. ఈ స్కామ్ వల్ల అక్కడ  కొన్ని వేల కుటుంబాలు అతలాకుతలం అయ్యాయి. మూడు సంవత్సరాలు "మోసగాళ్ళు" కథపై వర్క్ చేశాం. హాలీవుడ్ స్థాయికి ధీటుగా  జెఫ్రీ ఈ చిత్రాన్ని ఫెంటాస్టిక్ గా తెరకెక్కించాడు.

కథ నచ్చి కాజల్ ఈ సినిమాని ఎంతో స్పోర్టివ్ గా తీసుకొని చేసింది. నిజంగా చెప్పాలంటే ఈ చిత్రంలో కాజల్ హీరో\, మెయిన్ లీడ్ పాత్రలో నటించింది. అలాగే సునీల్ శెట్టి గారు పోలీస్ క్యారెక్టర్ చేశారు. నవదీప్, నవీన్ చంద్ర, వైవ.హర్ష టెరిఫిక్ క్యారెక్టర్స్ చేశారు. డైమండ్ రత్నబాబు, గౌతమ్ రాజు గారు చాలా హెల్ప్ చేశారు. ఫస్ట్ కాపీ చూశాక చాలా హ్యాపీగా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. చాలా నెర్వస్ గా కూడా వుంది.  సినిమా చూసిన వారంతా చాలా బాగుంది అని అప్రిషియేట్ చేశారు. ప్రేక్షకులందరు ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. అడిగిన వెంటనే మా చిత్రం ట్రైలర్ ని రిలీజ్ చేసిన చిరంజీవి గారికి నా కృతజ్ఞతలు. అలాగే ఈ సినిమాకి వాయిస్ ఓవర్ వెంకటేష్ గారు చెప్పారు.. ఆయనకి నా ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు.