సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (17:36 IST)

చిన్నప్పటి నుంచి ఆ వ్యాధి వల్ల ఇబ్బంది పడ్డాను: కాజల్ అగర్వాల్

దశాబ్ధ కాలం పాటు టాలీవుడ్ అగ్ర హీరోయిన్‌గా కొనసాగుతున్న కాజల్ అగర్వాల్.. ఇటీవలే వివాహం చేసుకుంది. పెళ్లి చేసుకున్నప్పటికీ ఆమె దూకుడు తగ్గలేదు. సోషల్ మీడియాలో సైతం యాక్టివ్‌గా ఉంటూ పలు విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా కాజల్ అగర్వాల్ ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది. ఐదేళ్ల వయసు నుంచి తాను బ్రాంకియల్ ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నానని కాజల్ చెప్పింది.
 
శీతాకాలంలో వ్యాధి మరింత ఎక్కువవుతుందని... ఈ వ్యాధి వల్ల తాను చాలా ఇబ్బందులు పడ్డానని తెలిపింది. ఆస్తమా వల్ల ఆహారం విషయంలో కూడా తాను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నానని చెప్పింది. ఆస్తమా నుంచి బయటపడేందుకు తాను ఇన్ హేలర్ వాడతానని కాజల్ తెలిపింది. 
 
ఇన్ హేలర్ వాడటం వల్ల కాస్త రిలీఫ్ లభించిందని చెప్పింది. అయితే ఇన్ హేలర్ వాడేందుకు చాలా మంది సిగ్గు పడుతుంటారని... ఎవరో ఏదో అనుకుంటారని భావించకూడదని, ఇన్ హేలర్‌లు ఉపయోగించాలని సూచించింది. అవుట్‌ డోర్‌ షూటింగ్స్‌కు వెళ్లినప్పుడు ఈ ఇన్‌హెలర్‌ను తీసుకువెళతాను. ఇది ఎప్పుడూ తనతోనే ఉంటుందని చెప్పుకొచ్చింది. 
 
కాగా ప్రస్తుతం కాజల్‌ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఆచార్య చిత్రంలో మెగాస్టార్‌ చిరంజీవి సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాక కమల్‌హాసన్ ''భారతీయుడు-2''తో పాటు హిందీలో ‘ముంబాయి సాగా’ సినిమాల్లో కూడా నటిస్తోంది