దెయ్యాలతో తలపడనున్న కాజల్ అగర్వాల్!

kajal agarwal
ఠాగూర్| Last Updated: బుధవారం, 9 డిశెంబరు 2020 (10:17 IST)
టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్. ఇటీవలే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత మాల్దీవుల్లోని సముద్ర భూగర్భ అందాల్లో తన హనీమూన్‌ను పూర్తి చేసుకుంది. ఆ తర్వాత తిరిగి తన సినీ కెరీర్‌పై దృష్టిసారించింది. ఇప్పటికే తాను కమిట్ అయిన మూవీల్లో నటించేందుకు షూటింగ్ స్పాట్‌లకు వెళుతోంది.

ఈ క్రమంలో ఆమె తమిళంలో ఓ చిత్రంలో నటించేందుకు పచ్చజెండా ఊపింది. అదీ కూడా ఓ హారర్ చిత్రం కావడం గమనార్హం. ఈ చిత్రానికి 'ఘోస్టీ' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. డీకే దర్శకత్వం వహించనున్నారు. ఇందులో నలుగురు కథానాయికల్లో ఒకరిగా కాజల్‌ నటించనుంది.

ఈ సినిమాలో హీరో ఎవరూ ఉండరని దర్శకుడు తెలిపారు. కాజల్‌ అగర్వాల్‌ పాత్రకు సంబంధించిన ఫొటోషూట్‌ను కూడా పూర్తిచేశామని ఆయన పేర్కొన్నారు. కెరీర్‌లో ఇప్పటివరకు హారర్‌ కథాంశంలో కాజల్‌ అగర్వాల్‌ నటించక పోవడం గమనార్హం.

తొలిసారి ఈ జోనర్‌లో సినిమా చేయడం ఆనందంగా ఉందని, తన పాత్ర చిత్రణలో వైవిధ్యం కనిపిస్తుందని కాజల్‌ అగర్వాల్‌ చెప్పింది. ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ దెయ్యాల వల్ల ఇబ్బంది పడే పోలీస్‌ అధికారిణి పాత్రలో కనిపించనుందని సమాచారం.

వచ్చే నెలలో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుందని తెలిసింది. ప్రస్తుతం కాజల్‌ అగర్వాల్‌ తెలుగులో 'ఆచార్య' 'మోసగాళ్లు' చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది. త్వరలో 'ఆచార్య' షూటింగ్‌లో పాల్గొనడానికి సిద్ధమవుతోంది.దీనిపై మరింత చదవండి :