బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (11:52 IST)

వెబ్ సిరీస్‌లో కాజల్ అగర్వాల్... పెళ్లి తర్వాత బిజీగా మారిన చందమామ...

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. గత యేడాది ఓ ఇంటికి కోడలైంది. తన ప్రియుడైన ముంబైకు చెందిన యువవ్యాపారవేత్త గౌతం కిచ్లూను ఆమ పెళ్లి చేసుకుంది. హనీమూన్‌ను మాల్దీవుల్లోని సముద్రపు అందాల నడుమ జరుపుకుంది. ప్రస్తుతం తాను కమిట్ అయిన చిత్రాల షూటింగులలో పాల్గొంటూ బిజీగా గడుపుతోంది.

సాధారణంగా పెళ్లి చేసుకున్న తర్వాత చాలా మంది హీరోయిన్లు వెండితెరకు దూరమయ్యారు. కానీ, సమంత, కాజల్, ఆనంది హీరోయిన్ల విషయంలో ఇది పూర్తి వ్యతిరేకం. పెళ్లి తర్వాత వీరికి అనేక అవకాశాలు వస్తున్నాయి. ఈ కోవలోనే కాజల్ అగర్వాల్‌కు సినిమాలతో పాటు ఓ వెబ్ సిరీస్‌లో నటించే అవకాశం కూడా లభించింది. 

రీసెంట్‌గా "లైవ్ స్ట్రీమింగ్" అనే త‌మిళ వెబ్ సిరీస్‌లో న‌టించింది. తాజాగా మ‌రో వెబ్ సిరీస్‌లో న‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం. తెలుగు ఓటీటీ మాధ్య‌మమైన 'ఆహా' ప‌లు వెబ్ సిరీస్‌లను రూపొందిస్తోంది. ఈ ఓటీటీలో ప్ర‌ముఖ దర్శ‌కుడు మారుతి ఓ వెబ్ సిరీస్‌ను రూపొందించ‌నున్నారు. త్రీ రోజస్ పేరుతో తెర‌కెక్క‌బోతున్న ఈ వెబ్ సిరీస్‌లో కాజ‌ల్ ప్ర‌ధాన పాత్ర‌ధారిగా న‌టించ‌నుంద‌ని స‌మాచారం.