శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (18:46 IST)

జీవితంలో ప్ర‌తీది జ్ఞాప‌కం, భ్ర‌దంగా చూసుకుంటున్నాః కాజ‌ల్‌

Kajal Agarwal, Gowtam kichu
పెళ్లికి ముందు త‌ర్వాత అనే విధంగా ప్ర‌తి మ‌హిళ జీవితం వుంటుంద‌నీ, ఇందులో తాను మిన‌హాయింపు కాద‌ని న‌టి కాజ‌ల్ అగ‌ర్వాల్ తెలియ‌జేస్తుంది. పెండ్లికిముందు పెద్ద‌గా బాధ్య‌త‌లు లేక‌పోయినా కెరీర్‌, తల్లిదండ్రుల‌ను చూసుకోవ‌డం అనేది స‌హ‌జ‌మ‌ని పేర్కొంది. కానీ పెళ్లి త‌ర్వాత పూర్తి బాధ్య‌త‌లు, బంధాలు అనేవి కొత్తవి ఏర్ప‌డ‌తాయ‌ని పేర్కొంది.  త‌ను ప్రేమించిన‌ గౌతమ్ కిచ్లు ని గత ఏడాది అక్టోబర్ 30 న ముంబైలోని తాజ్ కొలాబాలో వివాహం చేసుకున్న కాజ‌ల్ ఆ రోజునుంచి ప్ర‌తిరోజూ కొత్త‌గా వుంద‌ని చెబుతోంది. ఆ కొత్త‌ద‌నాన్ని సోష‌ల్‌మీడియాలో పంచుకుంది కూడా.  కాజల్ భర్తతో కలసి మాల్దీవ్స్ కి హనీమూన్ కి వెళ్లారు. ఆ తరువాత సినిమాలతో పాటు బిజినెస్ లోకి కూడా అడుగులు వేస్తున్నా అని తెలిపి అభిమానులను ఖుషి చేసారు. అయితే తాజాగా కాజల్ తన భర్త గౌతమ్ రొమాంటిక్ గా దిగిన ఒక పిక్ ని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసి ప్రతి జ్ఞాపకాన్ని భద్రంగా భద్రపర్చుకుంటున్నా అంటూ పోస్ట్ చేసారు.

పెళ్లి తరువాత కొత్త బంధాలు, కొత్త ఆలోచనలు, కొత్త బాధ్యతలతో జీవితం పూర్తిగా మారిపోయింది అంటూ చాలా సంతోష సమయాన్ని గడుపుతున్నా అంటుంది కాజల్. కాగా కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆచార్య సినిమాలో నటిస్తుంది, ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన‌గా మెగాస్టార్ ఆమెను సాద‌రంగా ఆహ్వానించి బొకేతో స‌త్క‌రించారు. ప్ర‌స్తుతం ఆమె చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంది. ఈ సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవ‌లే రామ్‌చ‌ర‌ణ్ కూడా తాను కీల‌క పాత్ర పోషిస్తున్న‌ట్లు సోష‌ల్‌మీడియాలో ఆనందం వ్య‌క్తం చేశాడు.ఇటీవ‌లే విడుద‌లైన ఆచార్య టీజర్ యూట్యూబ్ లో 10 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి టాప్ ట్రేండింగ్ లో వుంది.