సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 30 జనవరి 2021 (15:12 IST)

కంఫ‌ర్ట్ జోన్ చూసుకుంటున్న కాజ‌ల్‌!

Kajal Agarwal, Live telicast
ద‌క్షిణాదితోపాటు సౌత్‌లోనూ సినిమాలు చేస్తూ బిజీగా వున్న కాజ‌ల్ వివాహం త‌ర్వాత తాను కంఫ‌ర్ట్‌జోన్‌ను చూసుకుంటుంది. అందుకే ఆచితూచి సినిమాలు చేస్తుంది. తాజాగా ` లైవ్ టెలికాస్ట్‌` అనే వెబ్ సిరీస్‌తో ఓటిటి లోకి వ‌చ్చే‌లా ఒక సినిమా చేస్తుంది. 

ఇది త్వరలో డిస్నీ + హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఈ వెబ్ సిరీస్కు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. లైవ్ టెలికాస్ట్ ఒక హాంటెడ్ జోనర్ అని ఇంట్లో చిక్కుకున్న మొండి టీవీ సిబ్బంది గురించి ఆ సిరీస్లో తన పాత్ర గురించి ఒక ప్రకటనలో తెలియజేసింది. కాజల్ ఆ సిరీస్ గురించి మాట్లాడుతూ, ఒక నటిగా నాకు ఈ సిరీస్ సవాల్ లాంటిది, నన్ను నేను ఒక కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావడానికి ఈ సిరీస్ చేశాను, లైవ్ టెలికాస్ట్ నా కెరియర్కి కూడా ఒక మైల్స్టోన్గా నిలుస్తుంది అని నాకు నమ్మకం వుంది అని తెలిపింది. ఇందులో అభిన‌య్‌తోపాటు ప‌లువురు అనుభ‌వం వున్న న‌టీన‌టులు న‌టించారు.