సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 జనవరి 2021 (11:42 IST)

పెళ్లయ్యాక డైరెక్టర్ తేజకు హ్యాండిచ్చిన కాజల్?

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవలే ఓ ఇంటికి కోడలైంది. ముంబైకు చెందిన యువ వ్యాపారవేత్త గౌతం కిచ్లూను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఆమె మాల్దీవుల్లో జరుపుకున్న హానీమూన్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. సముద్రపు గర్భంలోని అందాల నడుమ కాజల్ అగర్వాల్ శోభనం రాత్రి జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
అయితే, కాజల్ వివాహం చేసుకున్న తర్వాత తన సినీ కెరీర్‌ను కొనసాగిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న "ఆచార్య", విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న "భారతీయుడు-2" వంటి చిత్రాల్లో కాకుండా మరికొన్ని చిత్రాల్లో నటించేందుకు పచ్చజెండా ఊపింది. 
 
ఈ క్రమంలో తనను తెలుగు తెరకు పరిచయం చేసిన డైరెక్టర్ తేజకు ఆమె హ్యాండిచినట్టు సమాచారం. తేజ నిర్మించనున్న తాజా చిత్రం 'అలివేలు వెంకటరమణ' అనే చిత్రంలో నటించేందుకు కాజల్‌ గతంలో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 
 
అయితే ఆ సినిమా నుంచి కాజల్ వైదొలిగినట్టు తాజా సమాచారం. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆ సినిమా నుంచి కాజల్ తప్పుకుందట. ఆమె స్థానంలోకి తాప్సీ వచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది.