మహిళకు విలువ ఇవ్వడమే సీతాయణం
రామాయణం తెలుసు. రాముడి ప్రయాణం.. సీత ప్రయాణం తెలియాలంటే.. సీతాయణం సినిమా చూడాల్సిందే. తెలుగు, కన్నడలో భాషల్లో రూపొందిన సీతాయణం సినిమాలో అక్షిత్ శశికుమార్, అనహిత భూషన్ నాయికా నాయకులుగా నటించారు. లలిత రాజ్యలక్ష్మి నిర్మాత, ప్రభాకర్ అరిపాక దర్శకుడు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం రాముని కోసం సీత ప్రయాణం ఎటువైపు సాగింది అనేది కథ. పద్మనాభ్ భరద్వాజ్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే ఆదరణ పొందాయి.
సోమవారం హైదరాబాద్‌లో ట్రైలర్ విడుదలైంది. ఇందులో చిత్రకథంతా ఇమిడి వుంది. తండ్రితెలియక పోయినా బతికేయవచ్చు. కానీ శత్రువు ఎవరు తెలియకపోతే కష్టం.. అంటూ హీరో డైలాగ్... మంచి యాక్షన్ అంశంతో కూడుకున్నట్లుంది. అంతేకాక పెండ్లి పద్ధతులు కూడా ఇందులో చూపించారు. ఈ చిత్రం త్వరలో విడుదలచేయనున్నారు. మహిళలను గౌరవించడం, వారి భావాలకు విలువ ఇవ్వడమే చిత్ర కథాంశం.
కన్నడ స్టార్ శశికుమార్ తనయుడు అక్షిత్ తెలుగులో పరిచయం అవుతున్నారు. దర్శకుడు మాట్లాడుతూ.. నిర్మాత, శశికుమార్‌లు ఇద్దరూ కథను, నన్ను నమ్మి ఈ చిత్రం బాగా వచ్చేలా చేశారు. ఈ చిత్రం అన్ని వర్గాలవారికి నచ్చుతుందనే నమ్మకముంది. షూటింగును బ్యాంకాక్, మంగుళూరు, బెంగుళూరు ప్రాంతాల్లో చేశాం. ఇందులో మనసు పలికే .. పాటను వీడియో విడుదల చేశాం. శ్వేత మోహన్ బ్రీత్‌లెస్ సాంగ్ ఆదరణ పొందింది.
అదేవిధంగా రామాయణంలోని శ్లోకం ఇందులో చక్కటి పాటరూపంలో వుంటుంది. పెండ్లి కార్డ్‌తో వస్తున్న ఈ రూపకం.. సౌండ్ రూపంలో తెచ్చాం. మంచిమెలోడీస్‌గా. చంద్రబోస్, అనంతశ్రీరామ్ సాహిత్యం అందించారని పేర్కొన్నారు. ఇటువంటి కథతో భాగమైనందుకు ఆనందంగా వుంది. కన్నడ శశికుమార్ వారసుడు అక్షిత్ రావడం సంతోషం.
కొత్త పాయింట్‌గా తీసుకుని దర్శకుడు ఆవిష్కరించారు. అక్షిత్ శశికుమార్ తెలుపుతూ.. తెలుగు పరిశ్రమలో ఎంట్రీ ఇస్తున్నందుకు ఆనందంగా వుంది. మధునందన్, దర్శకుడు ప్రభాకర్‌కు దన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పాటలు బాగున్నాయి. సినిమా బాగా వచ్చింది అని తెలిపారు. ఇంకా ఈ సినిమాలో బిత్తిరి సత్తి, అజయ్ ఘోష్, విక్రమ్ శర్మ, కృష్ణభగవాన్, గుండు సుదర్శన్ తదితరులు నటించారు. సమర్పణః రోహన్ భరద్వాజ్, కెమెరాః దుర్గాప్రసాద్ కొల్లి.