పవర్ స్టార్ దూకుడు... మరో కొత్త ప్రాజెక్టుపై ఫోకస్!

pawan
ఠాగూర్| Last Updated: ఆదివారం, 25 అక్టోబరు 2020 (17:35 IST)
జోడు గుర్రాలపై స్వారీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇపుడు దూకుడు పెంచాడు. అటు రాజకీయాల్లో, ఇటు సినిమా రంగాలను ఏలేలా ఆయన తన ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఇందులోభాగంగా, కొత్త మూవీ ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపుతూ సాగిపోతున్నారు.

ఇప్పటికే బాలీవుడ్ చిత్రం పింక్ రీమేక్‌ను తెలుగులోకి వకీల్ సాబ్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇపుడు హైదరాబాద్ నగరంలో సాగుతోంది. ఈ చిత్రం షూటింగ్ ఇంకా ముగియముందే ఆయన దర్శకులు క్రిష్ జాగర్లమూడి, హరీష్ శంకకర్, సురేందర్ రెడ్డిలతో కలిసి పని చేసేందుకు సమ్మతించారు.

తాజాగా పవన్ చేస్తున్న మరో సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడింది. సితార ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌పై సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందించనున్నాడు. మలయాళంలో హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్'కు రీమేక్‌గా ఈ చిత్రం నిర్మితంకానుంది.దీనిపై మరింత చదవండి :