సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డివి
Last Updated : శుక్రవారం, 30 అక్టోబరు 2020 (17:08 IST)

ఓదెల రైల్వే స్టేషన్ రెండో షెడ్యూల్ ప్రారంభం...

శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బేన‌ర్‌లో `ఏమైంది ఈవేళ`, `బెంగాల్ టైగ‌ర్` వంటి సూప‌ర్‌హిట్‌ చిత్రాల‌ను అందించిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంప‌త్‌నంది క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తో  ల‌క్ష్మీ రాధామోహ‌న్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాత‌ కె.కె.రాధామోహ‌న్ నిర్మిస్తోన్న డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ `ఓదెల రైల్వేస్టేష‌న్`. 
 
ఈ చిత్రం ద్వారా అశోక్ తేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యమ‌వుతున్నారు. హీరోగా ద‌య‌విట్టు గ‌మ‌నిసి, 8ఎంఎం బుల్లెట్, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్‌, మాయ‌బ‌జార్ 2016, వంటి హిట్ చిత్రాల‌తో పాటు క‌న్న‌డ‌లో 25 చిత్రాల‌కు పైగా న‌టించిన వ‌శిష్ట సింహ తెలుగులో హీరోగా న‌టిస్తోన్న మొద‌టి సినిమా ఇది. ఈ చిత్రంలో ప‌ల్లెటూరి అమ్మాయిగా ఒక వైవిద్య‌మైన పాత్ర‌లో హీరోయిన్ హెబ్బా ప‌టేల్ న‌టిస్తోంది. 
 
‘ఓదెల’ అనే గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఓ వైవిధ్యభరిత క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. మేకప్, డ్రీమ్‌ సీక్వెన్సెస్, పాటలులేకుండా సినిమాను ఎంతో వాస్తవికంగా తెరకెక్కించనున్నారు. క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఓదెలలో మొద‌టి షెడ్యూల్ పూర్తిచేసింది చిత్ర యూనిట్‌. 
 
షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే హైద‌రాబాద్‌లో డబ్బింగ్ కార్య‌క్ర‌మాలు కూడా ప్రారంభ‌మ‌య్యాయి. ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల కార‌ణంగా షూటింగుకి కొంత గ్యాప్ ఇచ్చిన చిత్ర‌యూనిట్ ఈ రోజు (అక్టోబ‌ర్ 30) నుండి రెండో షెడ్యూల్ షూటింగ్‌కి రెడీ అయ్యింది. 
 
ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత కె.కె. రాధా మోహ‌న్ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వ‌ర్షాల కార‌ణంగా నిలిపిన ఓదెల రైల్వేస్టేషన్ సెకండ్ షెడ్యూల్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో చిత్రంలోని కొన్ని కీల‌క‌మైన‌ స‌న్నివేశాల‌తో పాటు క్లైమాక్స్‌ను చిత్రీక‌రించ‌నున్నాం. ఇప్ప‌టికే డబ్బింగ్ కార్య‌క్ర‌మాలు మొద‌ల‌య్యాయి. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి త్వ‌ర‌లో మీ ముందుకు తీసుకువ‌స్తాం అని చెప్పారు.
 
మొద‌టి షెడ్యూల్‌లో కొన్ని సీన్లను ఓదెల ర్వైల్వేస్టేషనులో చిత్రీకరించగా మరికొన్ని సన్నివేశాలను ఓదెల మండలంలో తెర‌కెక్కించ‌డం జ‌రిగింది. త‌మ  గ్రామంలో సినిమాను చిత్రీకరిస్తూ ఈ మండలం గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం ఆనందంగా ఉంద‌ని దర్శకుడు సంపత్ నందికి ఓదెల గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
 
వ‌శిష్ట‌సింహ‌, హెబా ప‌టేల్, సాయిరోన‌క్, పూజితా పొన్నాడ‌, నాగ‌మ‌హేష్‌(రంగ‌స్థ‌లం ఫేమ్‌), భూపాల్‌, శ్రీ‌గ‌గ‌న్, దివ్య సైర‌స్‌, సురేంద‌ర్ రెడ్డి, ప్రియా హెగ్దె త‌దిత‌రులు న‌టిస్తోన్నఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి: ఎస్. సౌంద‌ర్ రాజ‌న్‌, సంగీతం: అనూప్ రూబెన్స్, ఎడిటింగ్‌: త‌మ్మిరాజు, ఫైట్స్‌:  రియ‌ల్ స‌తీష్‌, స‌మ‌ర్ఫ‌ణ‌: శ్రీ‌మ‌తి ల‌క్ష్మీ రాధామోహ‌న్, నిర్మాత‌: కె.కె.రాధామోహ‌న్, క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే: సం ప‌త్‌నంది, ద‌ర్శ‌క‌త్వం: అశోక్ తేజ‌.K.K.